#TuJhoothiMainMakkaar : మొత్తానికి బాలీవుడ్ లో.. ఇంకో 100 కోట్ల సినిమా.. సక్సెస్ కొట్టిన రణబీర్ కపూర్..
తాజాగా రణబీర్ కపూర్ మరోసారి బాలీవుడ్ కి సక్సెస్ ని అందించాడు. గత సంవత్సరం బ్రహ్మాస్త్ర సినిమాతో పర్వాలేదనిపించే హిట్ కొట్టిన రణబీర్ కపూర్ ఇప్పుడు తూ జూతి మైన్ మక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా...................

Ranbir Kapoor Tu Jhoothi Main Makkaar movie collects 100 crores net collections in Bollywood
#TuJhoothiMainMakkaar : గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ వస్తుండటంతో నిరాశలో ఉన్న బాలీవుడ్ కి షారుఖ్ పఠాన్ సినిమాతో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఒక్కసారిగా సక్సెస్ ని అందించాడు. దీంతో బాలీవుడ్ కి మంచి రోజులు వచ్చాయి అని బాలీవుడ్ జనాలు సంబరపడిపోయారు. అయితే ఆ తర్వాత వచ్చిన స్టార్ హీరోల సినిమాలు షెహజాదా, సెల్ఫీ మళ్ళీ ప్రేక్షకులని నిరాశపరిచాయి. ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇక మరిన్ని చిన్న సినిమాలది కూడా అదే పరిస్థితి. దీంతో బాలీవుడ్ మళ్ళీ పాత స్థితిలోకి వెళ్ళిపోయింది.
అయితే తాజాగా రణబీర్ కపూర్ మరోసారి బాలీవుడ్ కి సక్సెస్ ని అందించాడు. గత సంవత్సరం బ్రహ్మాస్త్ర సినిమాతో పర్వాలేదనిపించే హిట్ కొట్టిన రణబీర్ కపూర్ ఇప్పుడు తూ జూతి మైన్ మక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీతో మార్చ్ 8న కేవలం హిందీలోనే రిలీజయింది. అసలు అంచనాలు లేకుండా రిలీజయిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది.
తాజాగా తూ జూతి మైన్ మక్కర్ సినిమా ఆదివారం మార్చ్ 19 నాటికి 101 కోట్ల నెట్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. అంటే దాదాపు 160 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది సినిమా. కామెడీ, రొమాంటిక్, ఎక్స్ పోజింగ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో యూత్ ఈ సినిమాకి బాగా అట్రాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో మంచి ఫామ్ లోనే ఉంది. దీంతో బాలీవుడ్ కి మరో సక్సెస్ ఇచ్చాడు రణబీర్. అయితే ఈ సినిమాకు దాదాపు 150 కోట్ల బడ్జెట్ అయింది. ఫుల్ రన్ లో తూ జూతి మైన్ మక్కర్ ఎంత రాబడుతుందో చూడాలి. ఈ సినిమా 100 కోట్లు రావడంతో మరోసారి బాలీవుడ్ లో ఆశలు చిగురించాయి. త్వరలో రాబోయే అజయ్ దేవగణ్ భోళా సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
Hum humare poore hosh-o-hawason mein, Ishwar ko saakshi maanke yeh confirm karte hai ki aapke pyaar mein koi makkaari nahi hai. 😍
Thankyou for all the support for #TuJhoothiMainMakkaar. ✨#TuJhoothiMainMakkaar in cinemas now. 💕 pic.twitter.com/rK5Z5RPjb0— Luv Films (@LuvFilms) March 19, 2023