Anushka Sharma : రణబీర్ ఫేవరేట్ ఆలియా కాదట.. ఆ క్రికెటర్ భార్యే ఇష్టం అంటున్న రణబీర్..

తాజాగా రణబీర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పాడు. రణబీర్ మాట్లాడుతూ..............

Anushka Sharma : రణబీర్ ఫేవరేట్ ఆలియా కాదట.. ఆ క్రికెటర్ భార్యే ఇష్టం అంటున్న రణబీర్..

Ranbir kapoor :  బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రెండు నెలల క్రితమే అలియాభట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం ఆలియా తాను తల్లి కాబోతున్నాను అని కూడా ప్రకటించింది. ఇక రణబీర్ ప్రస్తుతం షంషేరా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జులై 22న థియేటర్లలో విడుదల అవ్వనుంది. దీంతో చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రణబీర్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలని తెలిపుతున్నాడు.

తాజాగా రణబీర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పాడు. రణబీర్ మాట్లాడుతూ.. ”నా ఫేవరేట్ హీరోయిన్ అనుష్క శర్మ. మేమిద్దరం గతంలో ఏ దిల్ హై ముష్కిల్, బాంబే వెల్వెట్, సంజు లాంటి సినిమాల్లో కలిసి నటించాం. అనుష్క నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరం ఎప్పుడూ గొడవపడుతూ ఉంటాము. క్రియేటివిటి విషయంలో కూడా ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాము. విరాట్ తో పెళ్లి తర్వాత కూడా అనుష్కతో నా స్నేహం అలాగే కొనసాగుతుంది. తాను నా ఫేవరేట్ కో స్టార్ కూడా” అని చెప్పాడు.

Nayanathara : హనీమూన్ నుంచి రాగానే షూటింగ్‌కి వెళ్లిపోయిన నయన్

దీంతో ఆలియా పేరు చెప్పలేదని ఆలియా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఇక అనుష్క శర్మ విరాట్ తో పెళ్లి తర్వాత సినిమాలకి దూరంగా ఉంది. ఆ తర్వాత వాళ్లకి పాప కూడా పుట్టడంతో అనుష్కకి, సినిమాలకి చాలా గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం అనుష్క చక్దా ఎక్స్‌ప్రెస్‌లో నటిస్తోంది. ఇందులో భారత మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామిగా అనుష్క నటిస్తుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత అనుష్క మళ్లీ బాలీవుడ్ లో మెరవనుంది.