Bhola Shankar: భోళాశంకర్ సినిమాలో చిరుతో చిందేయనున్న రష్మీ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్ మాస్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మసాలా మూవీ "భోళా శంకర్". ఇది తమిళంలో అజిత్ నటించిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా రాబోతుంది. ఏడాది క్రితమే షూటింగ్ మొదలుపెట్టుకొని మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వచ్చింది. టాలీవుడ్ లో యాంకర్ గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న 'రష్మీ' భోళాశంకర్ సినిమాలో చిరుతో కలిసి చిందేసిందట.

Bhola Shankar: భోళాశంకర్ సినిమాలో చిరుతో చిందేయనున్న రష్మీ..

Rashmi item song in Chiru Bhola Shankar movie

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్ మాస్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మసాలా మూవీ “భోళా శంకర్”. ఇది తమిళంలో అజిత్ నటించిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా రాబోతుంది. ఏడాది క్రితమే షూటింగ్ మొదలుపెట్టుకొని మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా, ఆ తరువాతి షెడ్యూల్ ఇప్పటివరకు స్టార్ట్ చేయలేకపోయింది. చిరు ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో బిజీ అవ్వడంతో భోళాశంకర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ సెట్‌‌లో మెహర్ రమేష్, శేఖర్ మాస్టర్ పుట్టినరోజు వేడుకలు..

కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వచ్చింది. టాలీవుడ్ లో యాంకర్ గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ‘రష్మీ’ భోళాశంకర్ సినిమాలో చిరుతో కలిసి చిందేసిందట. ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తాను చిరంజీవితో కలిసి ఒక మాస్ నెంబర్ కి డాన్స్ వేసినట్లు వెల్లడించింది.

ఇక ఈ సినిమాలో చిరుకి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా, స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ చిరంజీవికి చెల్లిగా కనిపించబోతుంది. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఆచార్య నుంచి మొదలు పెట్టుకొని గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళాశంకర్ సినిమాలతో వరుసగా మూడు నెలల గ్యాప్ తో మూవీలు విడుదల చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు మెగాస్టార్.