Rashmika Mandanna: సంవత్సరాలు గడుస్తున్నా కొన్ని విషయాలు నన్ను ఇంకా బాధ పెడుతూనే ఉన్నాయి.. ఎమోషనల్ అయిన రష్మిక!
పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందాన.. నేడు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ మాట్లాడింది. తెలుగు, తమిళ సినిమాలో స్టార్ హీరోయిన్ ఉన్న ఈ భామ ఇటీవలే అమితాబ్ 'గుడ్ బై' మూవీతో నార్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా సోషల్ మీడియాలో తనపై జరిగే ట్రోలింగ్ తనని, తనతో సంబంధం ఉన్న వ్యక్తులను చాలా బాధిస్తున్నాయి అంటూ విచారం వ్యక్తం చేసింది.

Rashmika Mandanna getting emotional because of negative trolling
Rashmika Mandanna: పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందాన.. నేడు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ మాట్లాడింది. తెలుగు, తమిళ సినిమాలో స్టార్ హీరోయిన్ ఉన్న ఈ భామ ఇటీవలే అమితాబ్ ‘గుడ్ బై’ మూవీతో నార్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా సోషల్ మీడియాలో తనపై జరిగే ట్రోలింగ్ తనని, తనతో సంబంధం ఉన్న వ్యక్తులను చాలా బాధిస్తున్నాయి అంటూ విచారం వ్యక్తం చేసింది.
Rashmika Mandanna : స్పెషల్ యాడ్ షూట్ కోసం దుబాయ్ ఎడారిలో రెచ్చిపోయి ఫోజులిచ్చిన రష్మిక
“సంవత్సరాలు గడుస్తున్నా కొన్ని విషయాలు నన్ను ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. వాటి గురించి ఇవాళ మాట్లాడాల్సినా అవసరం ఉంది. నేను నా కెరీర్ మొదలుపెట్టినప్పుడు నుంచి ఇప్పటి వరకు ట్రోలింగ్ గురవుతూనే వస్తున్నా. ముఖ్యంగా ఇంటర్వ్యూలలో నేను చెప్పిన కొన్ని విషయాలు నాకు వ్యతిరేకంగా మారుతున్నాయి. వాటివల్ల ఇండస్ట్రీలో మరియు నా సన్నిహితుల మధ్య నాకున్న సంబంధాలు దెబ్బతింటున్నాయి.
నేను ఎంచుకున్న జీవితంలో నన్ను ప్రతి ఒక్కరు ఇష్టపడాలనే రూల్ ఏమి లేదు, కానీ ఎదుటివారి లైఫ్ ని మీ న్యూస్ ఐటమ్ కోసం వాడుకోవడం తప్పు అంటున్న. సినిమాలో నటించి మిమ్మల్ని ఆనందపరచడానికి నా వంతు కృషి నేను చేస్తా, ఏమైనా తప్పులు ఉంటే నిర్మాణాత్మక విమర్శలు చేయండి. అవి నా నటనను మెరుగుపరుచుకోడానికి ఉపయోగపడుతాయి. కానీ ఇలా ద్వేషం చూపిస్తూ నెగటివిటి క్రియేట్ చేస్తుంటే మనసుకి ఎంతో బాధ కలిగిస్తుంది” అంటూ వ్యాఖ్యానించింది.