Raviteja Next Movie Titled Eagle: మరో క్రేజీ ప్రాజెక్టుకు మాస్ రాజా రెడీ.. టైటిల్ కూడా క్రేజీయే!

మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా తన నెక్ట్స్ ప్రాజెక్టులను వరుసబెట్టి చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. తాజాగా మాస్ రాజా మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Raviteja Next Movie Titled Eagle: మరో క్రేజీ ప్రాజెక్టుకు మాస్ రాజా రెడీ.. టైటిల్ కూడా క్రేజీయే!

Raviteja Next Movie Titled Eagle With Karthik Ghattamaneni

Raviteja Next Movie Titled Eagle: మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా తన నెక్ట్స్ ప్రాజెక్టులను వరుసబెట్టి చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. ఇప్పటికే ధమాకా, టైగర్ నాగేశ్వర రావు, రావరణాసుర వంటి సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు.

Raviteja: ‘ఛాంగురే బంగారు రాజా’ అంటోన్న మాస్ రాజా.. కానీ!

అయితే తాజాగా మాస్ రాజా మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ సినిమాటోగ్రఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా మారి రవితేజతో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి బౌండ్ స్క్రిప్టు కూడా ఇప్పటికే రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ మాస్ రాజా మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Raviteja : రవితేజకి ఏమైంది..? ఎందుకీ వరుస ఫ్లాపులు..?

మరో విశేషమేమిటంటే.. ఈ సినిమాకు ఆల్రెడీ ఓ క్రేజీ టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిందట. ఈ సినిమా కథానుసారంగా ‘ఈగల్’ అనే టైటిల్ ఈ సినిమాకు పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నాడట. ఇక ఈ సినిమాను మెజారిటీ శాతం ఫారిన్ లొకేషన్స్‌లో షూటింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుండగా, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.