Raviteja: హాలీవుడ్ రీమేక్‌లో రవితేజ్.. మాస్..!

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ధమాకా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో పాటు రవితేజ తన నెక్ట్స్ చిత్రాలుగా రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలను కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్ దశలోనే ఉండగా, రవితేజ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును ఓకే చేసే పనిలో ఉన్నాడు.

Raviteja: హాలీవుడ్ రీమేక్‌లో రవితేజ్.. మాస్..!

Raviteja Next Movie To Be A Hollywood Remake

Raviteja: మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ధమాకా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాతో పాటు రవితేజ తన నెక్ట్స్ చిత్రాలుగా రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలను కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్ దశలోనే ఉండగా, రవితేజ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును ఓకే చేసే పనిలో ఉన్నాడు.

Raviteja Next Movie Titled Eagle: మరో క్రేజీ ప్రాజెక్టుకు మాస్ రాజా రెడీ.. టైటిల్ కూడా క్రేజీయే!

ఇప్పటికే ప్రముఖ సినిమాటోగ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని రవితేజకు ఓ పవర్‌ఫుల్ కథను నెరేట్ చేయగా, రవితేజ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు కార్తీక్ ఘట్టమనేని రెడీ అవుతున్నాడట. అయితే ఈ సినిమా హాలీవుడ్‌లో వచ్చిన ఓ బ్లాక్‌బస్టర్ యాక్షన్ మూవీకి రీమేక్‌గా రాబోతుందా అంటే.. అవుననే తెలుస్తోంది. హాలీవుడ్‌లో తెరకెక్కిన ‘జాన్ విక్’(John Wick) మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

Raviteja: మరో యంగ్ బ్యూటీతో మాస్ రాజా రోమాన్స్..?

పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడట. తెలుగు ఆడియెన్స్‌కు సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా ఈ సినిమాను తీర్చిదిద్దేందుకు కార్తీక్ రెడీ అవుతున్నాడట. అటు రవితేజ కూడా ఈ యాక్షన్ మూవీ రీమేక్‌పై ఆసక్తిని చూపడంతో ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. మరి రవితేజ కార్తీక్ ఘట్టమనేనితో చేయబోయే మూవీ నిజంగానే హాలీవుడ్ సినిమాకు రీమేక్‌గా వస్తుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.