‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’.. సంక్రాంతికి వస్తున్నాడు..

  • Published By: sekhar ,Published On : July 29, 2020 / 04:21 PM IST
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’.. సంక్రాంతికి వస్తున్నాడు..

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన అఖిల్ ఫస్ట్ లుక్, సిద్ శ్రీరామ్ సాంగ్, పూజా హెగ్డే లుక్‌కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.



Most Eligible Bachelor

బుధవారం చిత్రయూనిట్ అఖిల్, పూజా హెగ్డే ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు 70 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఓ షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గగానే ఈ షెడ్యూల్‌ను చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ లాక్ డౌన్‌లో గొపీసుంద‌ర్‌తో మ్యూజిక్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేశారు. అలాగే అతి త్వ‌ర‌లో డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు మెద‌లు పెట్ట‌బోతున్నారు.



Most Eligible Bachelorప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఆమని, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2021 జ‌న‌వ‌రిలో విడుద‌ల చేయటానికి నిర్మాతలు స‌న్నాహ‌లు చేస్తున్నారు.