RGV : వాళ్ళు ఇకపై సినిమాలు దానికోసమే తీసుకోవాలి.. బాలీవుడ్ పై మరోసారి ఆర్జీవీ వ్యాఖ్యలు.. | RGV comments on bollywood movies again

RGV : వాళ్ళు ఇకపై సినిమాలు దానికోసమే తీసుకోవాలి.. బాలీవుడ్ పై మరోసారి ఆర్జీవీ వ్యాఖ్యలు..

సౌత్ కి సపోర్ట్ గానే ఆర్జీవీ బాలీవుడ్ ని విమర్శిస్తూ, ప్రశ్నిస్తూ ఇప్పటివరకు ట్వీట్స్ చేశాడు. బాలీవుడ్ వాళ్ళకి ఛాలెంజ్ లు కూడా విసిరాడు. తాజాగా బాలీవుడ్ పై మరో ట్వీట్ చేశాడు ఆర్జీవీ.......

RGV : వాళ్ళు ఇకపై సినిమాలు దానికోసమే తీసుకోవాలి.. బాలీవుడ్ పై మరోసారి ఆర్జీవీ వ్యాఖ్యలు..

RGV :  వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతోనే కాక తన ట్వీట్లతో కూడా వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల సౌత్ సినిమాలు బాలీవుడ్ లో కూడా భారీ విజయం సాధించడంతో సౌత్ వర్సెస్ నార్త్ అని అంతా మాట్లాడుతున్నారు. దీనిపై ఇప్పటికే పలు మార్లు ఆర్జీవీ ట్వీట్స్ చేశాడు. సౌత్ కి సపోర్ట్ గానే ఆర్జీవీ బాలీవుడ్ ని విమర్శిస్తూ, ప్రశ్నిస్తూ ఇప్పటివరకు ట్వీట్స్ చేశాడు. బాలీవుడ్ వాళ్ళకి ఛాలెంజ్ లు కూడా విసిరాడు. తాజాగా బాలీవుడ్ పై మరో ట్వీట్ చేశాడు ఆర్జీవీ.

ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ లో.. సౌత్ సినిమా థియేటర్ కి వెళ్లి విజయం సాధిస్తున్నాయి, బాలీవుడ్ సినిమాలు మాత్రం అసలు థియేటర్ కి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే బాలీవుడ్ వాళ్ళు త్వరలో కేవలం ఓటీటీ కోసమే సినిమాలు తీస్తారేమో” అని పోస్ట్ చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Sonal Chauhan : అందుకే తెలుగులో గొప్ప సినిమాలు వస్తున్నాయి..

ఆర్జీవీ చెప్పింది కూడా నిజమే. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు సైతం ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. థియేటర్ కి వెళ్లి రిస్క్ చేయడం ఎందుకని గత కొన్ని రోజులుగా బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. మరి ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖులు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

×