RGV : మా చిరంజీవిని అంటావా.. గరికపాటిపై ఆర్జీవీ తీవ్ర విమర్శలు..

ఆర్జీవీ తన ట్విట్టర్లో.. ''ఐ యాం సారీ నాగబాబు గారు మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రకతో సమానం. త్తగ్గేదెలె. హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో...............

RGV : మా చిరంజీవిని అంటావా.. గరికపాటిపై ఆర్జీవీ తీవ్ర విమర్శలు..

RGV :  ఇటీవల ఓ సభలో గరికపాటి నరసింహారావు మాట్లాడాల్సిన సమయంలో అందరూ చిరంజీవితో ఫోటోలకు ఎగబడుతుండటంతో గరికపాటి చిరంజీవి మీద సీరియస్ అయ్యారు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ విషయంలో గరికపాటికి విమర్శిస్తున్నారు.

ఆ తర్వాత గరికపాటి నరసింహారావు చిరంజీవికి క్షమాపణలు కూడా చెప్పారు. అయినా ఈ వివాదం ముగియలేదు. గాడ్ ఫాదర్ ఈవెంట్లో పలువురు ఈ అంశంపై మాట్లాడుతూ గరికపాటిని విమర్శించారు. తాజాగా ఆర్జీవీ ఈ ఘటనపై స్పందించారు. నాగబాబు చేసిన ట్వీట్స్ ని రీట్వీట్ చేస్తూ ఆర్జీవీ గరికపాటిపై ట్విట్టర్లో దారుణంగా విమర్శలు చేశారు.

ఆర్జీవీ తన ట్విట్టర్లో.. ”ఐ యాం సారీ నాగబాబు గారు మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రకతో సమానం. త్తగ్గేదెలె. హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో. హే గూగురుపాటి నరసింహ రావు, తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి. సర్ నాగబాబు గారు మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి, దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు. సర్ నాగబాబు గారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీని ఎందుకు ఇచ్చారు సర్” అంటూ తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్స్ చేయడంతో ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి.

Sreemukhi : శ్రీముఖి సరికొత్త షో.. అనిల్ రావిపూడి, స్నేహ జడ్జీలుగా.. ఈ సారి జంటలతో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అంటూ..

గరికపాటి, చిరంజీవి వివాదం ఇంకా ముదిరేలా కనిపిస్తుంది. ఈ విషయంలో కొంతమంది గరికపాటిని సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది చిరంజీవిని సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎప్పుడు ఆగుతుందో చూడాలి.