Sreemukhi : శ్రీముఖి సరికొత్త షో.. అనిల్ రావిపూడి, స్నేహ జడ్జీలుగా.. ఈ సారి జంటలతో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అంటూ..

శ్రీముఖి యాంకర్ గా సరికొత్త రియాలిటీ షో రాబోతుంది. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అనే టైటిల్ తో ఒకరికి ఒకరు సబ్ టైటిల్ తో ఈ షో రానుంది. టీవీ రంగంలోని పది ఫేమస్‌ సెలబ్రిటీ జంటలతో ఈ షోని నిర్వహించనున్నారు............

Sreemukhi : శ్రీముఖి సరికొత్త షో.. అనిల్ రావిపూడి, స్నేహ జడ్జీలుగా.. ఈ సారి జంటలతో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అంటూ..

new tv show will start Sreemukhi as anchor and sneha, anil ravipudi, shivabalaji as judges

Sreemukhi :  శ్రీముఖి యాంకర్ గా సరికొత్త రియాలిటీ షో రాబోతుంది. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అనే టైటిల్ తో ఒకరికి ఒకరు సబ్ టైటిల్ తో ఈ షో రానుంది. టీవీ రంగంలోని పది ఫేమస్‌ సెలబ్రిటీ జంటలతో ఈ షోని నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం ఈ ప్రోగ్రాం లాంచింగ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. అక్టోబర్‌ 11 నుండి ప్రతి మంగళవారం రాత్రి 9-30 నిమిషాలకు ఈ షో రానుంది.

మొదటిసారి ఈ షో ద్వారా నటి స్నేహ, నటుడు శివ బాలాజీ, దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జిలుగా వ్యవహరించబోతున్నారు. అనిల్ రావిపూడి, స్నేహ టీవీ షోలోకి రావడంతో దీనికి మరింత హైప్ పెరిగింది. ఈ షోలో పాల్గొంటున్న పది జంటలకు రకారకాల టాస్క్‌లు ఉంటాయి. ఆ టాస్క్‌ల్లో విజేతగా నిలిచిన వారు ఫైనల్‌కి వెళ్లి గ్రాండ్‌ ఫినాలే టైటిల్‌తో పాటు భారీ ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంటారు.

BiggBoss 6 Day 36 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరున్నారో తెలుసా?? హౌస్ లో కొత్త జంటలు..

మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ షోలో టీవీ సెలబ్రిటీల రియల్ జంటలు, రీల్ జంటలు పాల్గొననున్నారు. ఈ పోటీలో 1. రవికిరణ్‌–సుష్మా 2. పవన్‌–అంజలి 3. సందీప్‌–జ్యోతి 4. హ్రితేష్‌–ప్రియా 5. శ్రీవాణి–విక్రమ్‌ 6. మధు–ప్రియాంక 7. ప్రీతమ్‌–మానస 8. సిద్దు–విష్ణుప్రియ 9. రాకేశ్‌–సుజాత 10. విశ్వ–శ్రద్ధ జంటలు పాల్గొంటున్నాయి. మరి ఈ షో టీవీ ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో చూడాలి.