NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి వేడుకల వేళ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. ఆ ఫ్యామిలిలో..

ఏపీలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొడాలి నాని, పేర్ని నాని, పలువురు వైసిపి నాయకులు, లక్ష్మి పార్వతి, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి వేడుకల వేళ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. ఆ ఫ్యామిలిలో..

RGV Sensational comments in NTR 100 Years celebrations

Updated On : May 28, 2023 / 1:55 PM IST

RGV :  తెలుగు భాషకు, తెలుగు వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్. మే 28 2023కు ఆయన పుట్టి 100 సంవత్సరాలు అవుతోంది. తెలుగువారంతా ఎన్టీఆర్ శత జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగువారు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఏపీలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొడాలి నాని, పేర్ని నాని, పలువురు వైసిపి నాయకులు, లక్ష్మి పార్వతి, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

NTR 100 Years: ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ఎన్టీఆర్ గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ

విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఆర్జీవీ మాట్లాడుతూ.. నేను ఓ జోక్ చెప్పడానికే బెజవాడకు వచ్చాను కానీ నవ్వురాని ఆ జోక్ రాజమండ్రిలో జరుగుతోంది. రాజమండ్రిలో సభను చూసి స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. చంద్రబాబు ఎలాంటి వాడో ఎన్టీఆర్ గతంలోనే చెప్పారు. వాళ్లే చంపేసి… ఈ రోజు వాళ్లే రక్తం తుడిచేశారు. ఎన్టీఆర్ ను చంపేసినోడి పక్కనే కూర్చుని రజనీకాంత్ పొగడటం నాకు చాలా బాదేసింది. రజనీకాంత్ వ్యాఖ్యలు చూస్తే ఎన్టీఆర్ కు వెన్నుపొటు పొడిచినట్లే ఉన్నాయి. నందమూరి కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్. మొసలి, పాము తరహాలో కన్నార్పని జీవి చంద్రబాబు. నేను తీయబోయే కొత్త సినిమాలో చంద్రబాబు క్యారెక్టర్ ను అరటి పండు ఒలిచినట్లు నోట్లో పెడతాను. ఆ తీయదనం మీరంతా కచ్చితంగా ఆస్వాదిస్తారు అని అన్నారు. దీంతో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు కానీ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.