NTR 100 Years: ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ఎన్టీఆర్ గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ

మన్ కీ బాత్‌లో నందమూరి తారక రామారావు గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

NTR 100 Years: ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ఎన్టీఆర్ గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ

NTR and PM Modi

Updated On : May 28, 2023 / 1:26 PM IST

PM Narendra Modi: నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ, విదేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ శ్రేణులు, తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ అభిమానులు ఆదివారం ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో పేద, బడుగు వర్గాలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ నామస్మరణ మారుమోగిపోతుంది.

NTR Birth Anniversary : ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్

ప్రధాని నరేంద్ర మోదీ ‘101వ మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో నందమూరి తారక రామారావు గురించి ప్రస్తావించారు. శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. కోట్లాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. చిత్రరంగంతో పాటు రాజకీయ రంగంలో తన ప్రతిభతో ఆ మహనీయుడు చెరగని ముద్ర వేశారని ప్రధాని కొనియాడారు. 300పైగా చిత్రాల్లో నటించి అలరించిన ఎన్టీఆర్.. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఆయన నటన ఇప్పటికీ స్మరిస్తారని మోదీ అన్నారు. బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్ సినీరంగంలో ఖ్యాతిగాంచారని, కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారని ప్రధాని మోదీ అన్నారు.