HER Movie : రుహాణి శర్మ HER చిత్రాన్ని విడుదల చేయబోతున్న సురేష్ ప్రొడక్షన్స్

రుహాణి శర్మ HER అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో రుహాణి శర్మ ఓ చాలెంజింగ్ రోల్..

HER Movie : రుహాణి శర్మ HER చిత్రాన్ని విడుదల చేయబోతున్న సురేష్ ప్రొడక్షన్స్

Ruhani Sharma HER Movie released by Suresh Productions in telugu states

HER Movie : చిలసౌ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది రుహాణి శర్మ. రీసెంట్ గా HIT సినిమాతో అందం, అందుకు తగ్గ అభియనం ఉన్న టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు HER అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Ram Charan- Upasana: మెగా కుటుంబంలో సంబరాలు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీధర్ స్వరగావ్ దర్శకత్వం వహించారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో HER ఫైనల్ కాపీ చుసిన సురేష్ ప్రొడక్షన్స్ వారు.. తమ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకొచ్చారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకి టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్ లభించడం తమ విజయానికి తొలి మెట్టు అని చెబుతున్నారు దర్శకనిర్మాతలు.

Adipurush : అప్డేట్ అవ్వండిరా అంటారు.. అప్డేట్ అయినా ట్రోల్ చేస్తారు.. ఆదిపురుష్ డిస్ట్రిబ్యూటర్!

ఇప్పటికే ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ సొంతం చేసుకుంది. గతంలో విడుదల చేసిన HER పోస్టర్స్, టీజర్ సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ చిత్రంలో రుహాణి శర్మ ఓ చాలెంజింగ్ రోల్ చేసిందని ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ కన్ఫర్మ్ చేశాయి. ఈ చిత్రానికి విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ బాణీలు కడుతున్నారు. అతి త్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్.