ఫస్ట్ డే సెంచరీ కొట్టిన సాహో!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో.. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.100 కోట్లు కొల్లగొట్టింది..

  • Published By: sekhar ,Published On : August 31, 2019 / 09:25 AM IST
ఫస్ట్ డే సెంచరీ కొట్టిన సాహో!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో.. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.100 కోట్లు కొల్లగొట్టింది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న గ్రాండ్‌గా విడుదలైంది. ఆగస్టు 29 రాత్రి నుండి యూఎస్‌లో భారీగా ప్రీమియర్స్ వేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. విపరీతమైన నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది.

 ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సాహోపై మంచి హైప్ ఏర్పడింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా మిలియన్ క్లబ్‌లోకి ఎంటరైన సాహో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.42 కోట్ల గ్రాస్ రాబట్టింది.

Read Also : జున్నుతో నాని : వైరల్ అవుతున్న వీడియో..

బాలీవుడ్‌లో రూ.24.40 కోట్లు వసూలు చేసి, బాలీవుడ్‌లో హయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ లిస్టులో మూడో స్థానంలో నిలవడం విశేషం. వీకెండ్ కావడం, పైగా వినాయక చవితి పండుగ రావడంతో వసూళ్లు పెరిగు అవకాశముందంటున్నారు ట్రేడ్ వర్గాల వారు..