SSMB 28 : సూపర్‌స్టార్ చెల్లెలిగా సాయి పల్లవి? మెగాస్టార్‌కే నో చెప్పింది కదా! | SSMB 28

SSMB 28 : సూపర్‌స్టార్ చెల్లెలిగా సాయి పల్లవి? మెగాస్టార్‌కే నో చెప్పింది కదా!

ఈ సినిమాలో ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న హీరో సిస్టర్ క్యారెక్టర్‌లో సాయి పల్లవి కనిపించనుందని వార్తలు వస్తున్నాయి..

SSMB 28 : సూపర్‌స్టార్ చెల్లెలిగా సాయి పల్లవి? మెగాస్టార్‌కే నో చెప్పింది కదా!

SSMB 28: సూపర్‌స్టార్ మహేష్ బాబు సోదరిగా మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి నటించనుందనే వార్త మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో మహేష్ మూడో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

SSMB 28 : సూపర్‌స్టార్ స్టైలిష్ లుక్ అదిరిందిగా..

‘సర్కారు వారి పాట’ తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబో రిపీట్ అవుతోంది.. మహేష్ నటించబోయే 28వ సినిమా ఇది..
వీరి కలయికలో వచ్చిన ఫస్ట్ మూవీ ‘అతడు’ సూపర్ డూపర్ హిట్ అవడమే కాక, టీవీలోనూ TRP రేటింగ్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది.

Ashok Galla : మేనల్లుడికి మహేష్ అభినందనలు..

‘ఖలేజా’ కాస్త నిరాశపరిచినా సూపర్ స్టార్‌లోని సరికొత్త కామెడీ కోణాన్ని ప్రేక్షకాభిమానులకు పరిచయం చేశారు త్రివిక్రమ్.. ఇప్పుడు మహేష్ కోసం సాలిడ్ స్టోరీ రెడీ చేశారాయన. హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. అంతకంటే ప్రాముఖ్యంగా ఈ సినిమాలో ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న హీరో సిస్టర్ క్యారెక్టర్‌లో సాయి పల్లవి కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.

Mahesh Babu : మహేష్ బాబుకి కరోనా నెగెటివ్

ఫిలింనగర్ సమాచారం మేరకు మహేష్-త్రివిక్రమ్ సినిమాలో సాయి పల్లవి చెల్లెలిగా నటించడం లేదు.. ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ లో చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేసిన సాయి పల్లవి, యంగ్‌గా కనిపించే మహేష్‌కి సోదరిగా ఎలా నటిస్తుంది? అనే మాటలు వినిపిస్తున్నాయి.

Sitara – Mahesh Babu : దుబాయ్‌లో సితార పాపతో సూపర్‌స్టార్..

×