Samantha: మనిషి అసలు స్వభావం బయటపడే సందర్భం ఇదే!

సినిమాలు, నటనతో సంబంధం లేకుండా ఎప్పుడూ హెడ్ లైన్స్ లో ఉండటం సమంతాకు అలవాటే. కాకపోతే గతం వేరు.. ప్రస్తుతం వేరు. చై నుంచి సపరేటయిన తర్వాత సామ్ ఎక్కువగా నెగెటివ్ వార్తల్లోనే నానింది.

Samantha: మనిషి అసలు స్వభావం బయటపడే సందర్భం ఇదే!

Samantha

Samantha: సినిమాలు, నటనతో సంబంధం లేకుండా ఎప్పుడూ హెడ్ లైన్స్ లో ఉండటం సమంతాకు అలవాటే. కాకపోతే గతం వేరు.. ప్రస్తుతం వేరు. చై నుంచి సపరేటయిన తర్వాత సామ్ ఎక్కువగా నెగెటివ్ వార్తల్లోనే నానింది. అందుకే ఆ నెగెటివిటీ నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తోంది. దేశ, దేశాలకు స్నేహితులతో కలిసి విహార యాత్రలు చేస్తుంది. మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ.. సోషల్ మీడియాలో పోస్టులు మాత్రం ఆపడం లేదు.

RRR: అమెరికాలో ఆర్ఆర్ఆర్ టికెట్ల రేట్ల తగ్గింపు.. కారణమేంటి?

చైతూతో విడిపోతున్నట్టు ప్రకటించిన అనంతరం సమంత సోషల్‌ మీడియాలో వరుసగా పోస్టులు షేర్ చేస్తుంది. నాగ చైతన్య సోషల్ మీడియాకి దూరంగా ఉంటుండగా సమంత మాత్రం తన పరిస్థితులను అన్వయించేలా రోజూ పోస్టులను పెడుతుంది. సమంత పెట్టే పోస్టులు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇప్పటికే ఇలా ఎన్నో పోస్టులు పెట్టిన సామ్ తాజాగా మనిషి అసలు స్వభావం బయటపడే సందర్భం ఇదేనని అర్ధం వచ్చేలా ప్రముఖ రైటర్ రాబర్ట్ రాసిన కొటేషన్ ని ఇన్ స్టాలో స్టోరీగా పోస్ట్ చేసింది.

Akhanda: బాలయ్య ఫ్యాన్స్ కు ఊరట.. అదిరే ట్రీట్ వచ్చేస్తుంది

మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆ మనిషి ఎలాంటి వారు అన్నది కచ్చితంగా తెలియజేస్తుందన్నారు. ఆ సమయంలోనే మనిషిలో అసలు స్వభావం బయటపడుతుందని రాబర్ట్ వ్యాఖ్యల్ని సామ్ తెలిపింది. డే బై డే పరిస్థితులు మారుతాయని.. మీకు ఏది రాసిపెట్టి ఉంటుందో.. ఏదైతే కోరుకుంటారా అది కచ్చితంగా జరుగుతుందని.. మీరు వేసుకున్న మార్గానికి మీ నిర్ణయాలే దారిని చూపిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాధలో ఉన్నప్పుడు తన స్వీయ అనుభవాన్ని ఇలా బయటపెడుతున్నా అని చర్చలు జరుగుతున్నాయి.