SamudraKhani : మహేష్ గారిని చూస్తే చాలు ఎనర్జీ వస్తుంది

ఈ ఈవెంట్ లో సముద్రఖని మాట్లాడుతూ.. ఇంత పెద్ద ప్రాజెక్టు లో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సర్. డైరెక్టర్ ప్రతి రోజు నాకు ఏదో ఒక విషయం........

SamudraKhani : మహేష్ గారిని చూస్తే చాలు ఎనర్జీ వస్తుంది

Samudrakhani

Sarkaru Vaari Paata  :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.

Parasuram : నాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి అని మెసేజ్ పెట్టారు మహేష్

ఈ ఈవెంట్ లో సముద్రఖని మాట్లాడుతూ.. ఇంత పెద్ద ప్రాజెక్టు లో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సర్. డైరెక్టర్ ప్రతి రోజు నాకు ఏదో ఒక విషయం నేర్పేవారు. ఆయన డైలాగ్స్ కత్తిలా ఉంటాయి. ఆయన రైటింగ్ నాకు చాలా ఇష్టం. తమన్ మ్యూజిక్ ని మ్యాజిక్ లా చేస్తాడు. ఈ సినిమాకి పని చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్. మహేష్ గారిని చూస్తే, ఆయనతో పని చేస్తే చాలా ఎనర్జీ వస్తుంది.