Sara Arjun : PS2 లో జూనియర్ ఐశ్వర్యరాయ్ గా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? మీకు బాగా తెలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంత పెద్దదైపోయిందో..

పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలో జూనియర్ ఐశ్వర్యారాయ్ గా నటించి మెప్పించిన అమ్మాయి పేరు సారా అర్జున్. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Sara Arjun : PS2 లో జూనియర్ ఐశ్వర్యరాయ్ గా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? మీకు బాగా తెలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంత పెద్దదైపోయిందో..

Sara Arjun acted in Ponniyin Selvan 2 as junior Aishwarya rai

Sara Arjun :  ఇటీవలే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా రిలీజయింది. పాన్ ఇండియా రిలీజయిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలనే తెచ్చుకుంటుంది. ఈ సినిమాలో విక్రమ్ – ఐశ్వర్య రాయ్ మధ్య యూత్ లో ఉన్నప్పటి లవ్ స్టోరీని చూపించారు. ఇందులో ఐశ్వర్య రాయ్ యంగ్ గా ఉన్నప్పటి క్యారెక్టర్ లో నటించిన అమ్మాయి అందర్నీ మెప్పిస్తుంది. తన అందంతో, నటనతో ఆ అమ్మాయి ప్రేక్షకులని అలరిస్తుంది. దీంతో ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తున్నారు.

పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలో జూనియర్ ఐశ్వర్యారాయ్ గా నటించి మెప్పించిన అమ్మాయి పేరు సారా అర్జున్. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? నాన్న సినిమాలో విక్రమ్ కూతురిగా నటించిన పాప. ఆ సినిమాలో సారా తన నటనతో అందర్నీ మెప్పించి ఏడిపించింది కూడా. నాన్న సినిమాలోని విక్రమ్ – సారా మధ్య సన్నివేశాలు ఇప్పటికి చాలా మంది ఇష్టపడతారు. ఆ సినిమా చేసినప్పుడు సారాకి కేవలం ఐదేళ్లు. 2011 లో వచ్చిన నాన్న సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది.

Akhil : ఏజెంట్ పోయింది.. మరి అఖిల్ నెక్స్ట్ సినిమా ఏంటి? వాళ్ళతోనేనా?

నాన్న సినిమా తర్వాత సారా అర్జున్ అనేక తమిళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇప్పుడు సారాకు 17 ఏళ్ళు. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యారాయ్ యువతిగా ఉన్నప్పటి పాత్రలో నటించి తన అందంతో, నటనతో ప్రేక్షకులని మెప్పించింది. దీంతో ప్రేక్షకులు, పలువురు ప్రముఖులు ఆమెను మెచ్చుకుంటూ భవిష్యత్తులో కచ్చితంగా హీరోయిన్ అవుతావని అంటున్నారు. మరి సారా భవిష్యత్తులో ఏ సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఇంకెంత పేరు సంపాదిస్తుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Sara Arjun (@saraarjun.offical)