IPL 2026: కోల్‌కతాపై చెన్నై ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
IPL 2026: కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. కోల్ కతాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్ కే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ ను చెన్నై బౌలర్లు కట్టడి చేశారు. దీంతో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 32 పరుగుల తేడాతో చెన్నై విక్టరీ కొట్టింది. ఈ సీజన్ లో చెన్నైకి ఇది వరుసగా రెండో విజయం. మరోవైపు కోల్ కతా తీరు మారలేదు. వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. ఈ సీజన్ లో కేకేఆర్ కు ఇది నాలుగో ఓటమి. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడిన కేకేఆర్.. ఒక్క విజయం కూడా సాధించలేదు.
