Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ వేట మామూలుగా లేదుగా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్....

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ వేట మామూలుగా లేదుగా!

Dialogue In Sarkaru Vaari Paata By Mahesh Is For Pawan Kalyan

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించడం.. ఈ సినిమాలో పోకిరి తరువాత అంతటి రేంజ్‌లో మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చానని మహేష్ చెప్పుకు రావడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్లకు ఎగబడ్డారు. ఇక ఈ సినిమాకు తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో వసూళ్ల వర్షం కురిసింది.

sarkaru Vaari Paata : అమెరికాలో ఈ రికార్డ్ ఒక్క మహేష్ బాబుకే.. రీజనల్ సినిమాతో వరుసగా నాలుగో సారి..

ఈ సినిమా తొలి వారం ముగిసే సరికి అదిరిపోయే వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మహేష్ మేనియా పవర్ ఏమిటో మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీక్ ముగిసే సరికి ఏకంగా రూ.141 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి మహేష్ సత్తా ఏమిటో చూపించింది. రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా వసూళ్ల పరంపరను కొనసాగిస్తూ వస్తోంది. ఇక షేర్ కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా తొలివారం ముగిసేసరికి ఏకంగా రూ.87 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. ఇక ఈ వారం భారీ సినిమాలేవీ రిలీజ్‌కు లేకపోవడంతో మరో వారం సర్కారు వారి పాట చిత్రానికి కలిసి రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Sarkaru Vaari Paata: ఎస్‌వీపీ@రూ.103 కోట్లు.. విజయవాడలో భారీ సెలబ్రేషన్స్!

మొత్తానికి మహేష్ మేనియాతో సర్కారు వారి పాట చూసిన ప్రేక్షకులు ఊగిపోతున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా, ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఫస్ట్ వీక్ షేర్ కలెక్షన్స్ ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 28.36 కోట్లు
సీడెడ్ – 9.34 కోట్లు
ఉత్తరాంధ్ర – 9.85 కోట్లు
గుంటూరు – 6.20 కోట్లు
ఈస్ట్ – 6.43 కోట్లు
వెస్ట్ – 4.82 కోట్లు
కృష్ణా – 4.70 కోట్లు
నెల్లూరు – 2.70 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 72.4 కోట్లు
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 6.25 కోట్లు
ఓవర్సీస్ – 8.35 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 87 కోట్లు (గ్రాస్ రూ.141.2 కోట్లు)