RV Gurupadam : టాలీవుడ్ లో మరో విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత..

ఫిబ్రవరి 2న దర్శక దిగ్గజం, కళాతపస్వి K విశ్వనాధ్ గారు మరణించి ఆ విషాదం నుంచి టాలీవుడ్ తేరుకోకముందే మరో సినీ ప్రముఖుడు మరణించాడు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడలో పలు సినిమాలు నిర్మించిన సీనియర్ నిర్మాత RV గురుపాదం కన్నుమూశారు................

RV Gurupadam : టాలీవుడ్ లో మరో విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత..

Senior Producer RV Gurupadam passed away

RV Gurupadam :  ఇటీవల టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి 2న దర్శక దిగ్గజం, కళాతపస్వి K విశ్వనాధ్ గారు మరణించి ఆ విషాదం నుంచి టాలీవుడ్ తేరుకోకముందే మరో సినీ ప్రముఖుడు మరణించాడు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడలో పలు సినిమాలు నిర్మించిన సీనియర్ నిర్మాత RV గురుపాదం కన్నుమూశారు.

తెలుగు, తమిళ, హిందీ, కన్నడలో 25కు పైగా సినిమాలని నిర్మించారు RV గురుపాదం. వయ్యారి భామలు వగలమారి భర్తలు, పులి బొబ్బిలి, సొమ్ము ఒకడిది సోకు ఒకడిది, తిరుపతి క్షేత్ర మహాత్యం.. లాంటి పలు సినిమాలని నిర్మించారు. ప్రస్తుతం గత కొన్నేళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. 53 ఏళ్ళ వయసులో గురుపాదం గుండెపోటుతో కన్నుమూశారు.

Amigos : అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌‌గా NTR..

ఫిబ్రవరి 5న ఆయన హైదరాబాద్ లోని స్వగృహం నందు సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.