Shah Rukh Khan : మక్కాలో షారుఖ్ ఖాన్ ‘ఉమ్రా’.. వైరల్ అవుతున్న ఫోటోలు..

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ 'రాజ్ కుమార్ హిరానీ'తో కలిసి షారుఖ్ 'డుంకి' అనే సినిమాని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల సౌదీ అరేబియా వెళ్ళింది చిత్ర యూనిట్. అక్కడ షూటింగ్ షెడ్యూల్ పూర్తీ చేసుకున్న...

Shah Rukh Khan : మక్కాలో షారుఖ్ ఖాన్ ‘ఉమ్రా’.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పఠాన్’ మూవీ షూటింగ్ పూర్తీ చేయగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. వచ్చే ఏడాది జనవరి 25న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. దీపికా పదుకొనే, జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు.

Shah Rukh Khan : కింగ్ ఖాన్ కొత్త లుక్ అదిరిందిగా

అలాగే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ‘రాజ్ కుమార్ హిరానీ’తో కలిసి షారుఖ్ ‘డుంకి’ అనే సినిమాని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల సౌదీ అరేబియా వెళ్ళింది చిత్ర యూనిట్. అక్కడ షూటింగ్ షెడ్యూల్ పూర్తీ చేసుకున్న తరువాత షారుఖ్ అక్కడి పవిత్ర ‘మక్కా’ నగరాన్ని సందర్శించుకున్నాడు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ మక్కాలో ‘ఉమ్రా’ చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న ఒక అభిమాని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

సౌదీ అరేబియాలో చేసే మక్కా యాత్రని ‘ఉమ్రా’ అంటారు. ఇక డివోషనల్ లుక్‌లో ఉన్న షారుఖ్ ఖాన్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా షారుఖ్, తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే మూవీ కూడా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. మరి కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని ఈ హీరోకి ఈ సినిమాలు హిట్టు ఇవ్వగలవేమో చూడాలి.