Pathaan Review : పఠాన్.. పాత కథకి సూపర్ యాక్షన్ సీన్స్ జోడింపు..

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం మెయిన్ లీడ్స్ లో సిద్దార్థ్ ఆనంద దర్శకత్వంలో బాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో వచ్చిన సినిమా పఠాన్. షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో................

Pathaan Review : పఠాన్.. పాత కథకి సూపర్ యాక్షన్ సీన్స్ జోడింపు..

Shahrukh Khan Pathaan Movie Review

Pathaan Review :  షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం మెయిన్ లీడ్స్ లో సిద్దార్థ్ ఆనంద దర్శకత్వంలో బాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో వచ్చిన సినిమా పఠాన్. షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అంతకుముందు సినిమాలు కూడా పరాజయం అవ్వడం, పఠాన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా కావడంతో ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ తోనే పఠాన్ కి దాదాపు 50 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. షారుఖ్ గ్రాండ్ కంబ్యాక్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. పఠాన్ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. దాదాపు 100 దేశాల్లో పఠాన్ సినిమా రిలీజయింది.

ఇక కథ విషయానికి వస్తే ట్రైలర్ లో చూపించినట్టుగానే ఓ టెర్రరిస్ట్ గ్రూప్ ఇండియాని టార్గెట్ గా చేసుకొని దాడులు చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ ఇండియా అధికారులకి తెలియడంతో వాటిని అడ్డుకోవడానికి పఠాన్ అనే మాజీ ఏజెంట్ ని రప్పిస్తారు. షారుఖ్ ఆ టెర్రరిస్ట్ గ్రూప్ ని ఎదుర్కొని ఎలా ఇండియాని కాపాడాడు అనేదే కథ. ఇలాంటి కథలు చాలా సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఈ కథకి అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లని జతచేర్చి సినిమాని హైలెవెల్ కి తీసుకెళ్లాడు డైరెక్టర్. షారుఖ్ ఖాన్ ఎలా కాపాడాడు? షారుఖ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అతను ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు? దీపికా ఎవరికీ హెల్ప్ చేసింది అనే అంశాలు తెరపై చూడాల్సిందే.

షారుఖ్ చాలా రోజుల తర్వాత కనపడటంతో అభిమానులకు కావలసినట్టు సిక్స్ ప్యాక్ బాడీతో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో కనిపించి మెప్పించాడు. దీపికా, జాన్ అబ్రహం కూడా యాక్షన్ సీన్స్ తో అదరగొట్టాడు. సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీరెన్స్ ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. వార్ లాంటి యాక్షన్ సినిమా తీసిన దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఈ సినిమాలో కూడా యాక్షన్ సీన్స్ ని అద్భుతంగా తెరకెక్కించాడు. దాదాపు 7 దేశాల్లో పఠాన్ యాక్షన్ సీన్స్ ని షూట్ చేశారు. ప్రతీ సీన్ టెక్నీకల్ గా కూడా చాలా హైగా ఉంటుంది. యాక్షన్, ఫైట్ సీక్వెన్స్ లని ఇష్టపడే వాళ్లకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. అయితే ట్విస్ట్ లాంటివి అంతగా లేకుండా, ఉన్నా ఆడియన్స్ గెస్ చేసేలాగా ఉండటం, ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు అంతగా ఎఫెక్ట్ గా లేకపోవడం, యాక్షన్స్ సీన్స్ మరీ ఎక్కువగా ఉండటం నార్మల్ ఆడియన్స్ కి మైనస్ అనిపిస్తుంది.

Sukumar : ఈ కుర్చీ మీ కోసమే రాజమౌళి సార్.. సుకుమార్ స్పెషల్ పోస్ట్..

కథ మామూలుదే అయినా కథనం కొత్తగా ట్రై చేసి సూపర్ యాక్షన్ సీన్స్ ని ట్రై చేసి కేవలం షారుఖ్ ని గ్రాండ్ గా పరిచయం చేయడానికే సినిమా తీసినట్టు అనిపిస్తుంది. కాకపోతే అభిమానులకి అదే కావాల్సింది కాబట్టి కింగ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. ప్రస్తుతానికి వేరే పెద్ద సినిమాలు ఏమి లేకపోవడం, షారుఖ్ కంబ్యాక్ సినిమా కావడంతో కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. దీంతో పఠాన్ సినిమా షారుఖ్ కి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిందని అంటున్నారు. మరి లాంగ్ రన్ లో ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.