Shalini Pandey: అవకాశాలు లేక అర్జున్ రెడ్డి బ్యూటీ అలా చేస్తోందా..?

టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ, షాలినీ పాండేలు ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. కానీ, హీరోయిన్ షాలినీ పాండే మాత్రం సినిమా ఛాన్సులు లేక ఐటెం సాంగ్స్ చేసేందుకు రెడీ అయ్యింది.

Shalini Pandey: అవకాశాలు లేక అర్జున్ రెడ్డి బ్యూటీ అలా చేస్తోందా..?

Shalini Pandey To Do Item Song In Khushi Movie

Shalini Pandey: టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ దేవరకొండ ఎలాంటి తుఫాన్ సృష్టంచాడో అందరికీ తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన షాలినీ పాండే హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో విజయాలు అందుకుని స్టార్ హీరో స్టేటస్‌ను దక్కించుకున్నాడు.

Shalini Pandey : నాకు చేసిన సహాయానికి విజయ్ కి థ్యాంక్స్ చెప్పాలి.. ఆ రోజు నేను మర్చిపోలేను..

కానీ, షాలినీ పాండే మాత్రం తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ను బిల్డ్ చేసుకోవాలని చూసింది. అయితే అమ్మడికి అర్జున్ రెడ్డి తరువాత ఆ స్థాయి సక్సెస్ మాత్రం దక్కలేదు. దీంతో ఈ బ్యూటీ కెరీర్ గ్రాఫ్ ప్రస్తుతం చాలా కిందకి వెళ్లిపోయింది. అయితే అమ్మడికి ప్రస్తుతం సినిమా ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగానే వస్తుండటంతో, ఈ బ్యూటీ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మళ్లీ తెలుగులో తన సత్తా చాటాలని షాలినీ పాండే భావిస్తోందట. అందుకోసం గ్లామర్ డోస్ పెంచేసి ఏకంగా ఐటెం సాంగ్స్‌లో కూడా చేసేందుకు రెడీ అయ్యిందట.

Shalini Pandey: బక్క చిక్కిన ‘అర్జున్ రెడ్డి’ భామ..!

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’లో ఓ ఐటెం సాంగ్‌లో షాలినీ చిందులు వేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోందట. అర్జున్ రెడ్డి హీరోతో రొమాన్స్ చేసిన బ్యూటీ, ఇప్పుడు అతడి సినిమాలోనే ఐటెం సాంగ్‌కు రెడీ అయ్యిందంటే.. అమ్మడి కెరీర్ ఎలా డల్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.