Shriya Saran : మా ఆయనకి నేను ముద్దు పెడితే తప్పేంటి?

తాజాగా ముంబైలో నిర్వహించిన దృశ్యం 2 స్పెషల్ ప్రీమియర్ లో భర్తతో కలిసి రాగా మీడియాకి భర్తతో కలిసి ఫోజులిచ్చింది శ్రియ. అయితే మీడియా ముందే తన భర్తకి లిప్ కిస్ ఇచ్చింది............

Shriya Saran : మా ఆయనకి నేను ముద్దు పెడితే తప్పేంటి?

Shriya Saran responded to trolls for kissing her husband in public

Updated On : November 24, 2022 / 7:26 AM IST

Shriya Saran :  ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియ ఇప్పటికి కూడా తెలుగు, హిందీ సినిమాలలో వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ఇటీవలే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సరసన దృశ్యం 2 రీమేక్ లో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా స్పెషల్ ప్రివ్యూలో శ్రియ తన భర్తతో కలిసి పాల్గొంది.

రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చీవ్‌ను శ్రియా 2018లో వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప కూడా ఉంది. ప్రస్తుత శ్రియ తన భర్తతో హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఇటు సినిమాల్లో కూడా నటిస్తుంది. తాజాగా ముంబైలో నిర్వహించిన దృశ్యం 2 స్పెషల్ ప్రీమియర్ లో భర్తతో కలిసి రాగా మీడియాకి భర్తతో కలిసి ఫోజులిచ్చింది శ్రియ. అయితే మీడియా ముందే తన భర్తకి లిప్ కిస్ ఇచ్చింది.

దీంతో కొంతమంది శ్రియని విమర్శిస్తున్నారు. గతంలో కూడా తన భర్తకి బహిరంగంగానే లిప్ కిస్ ఇచ్చింది. శ్రియ తన భర్తకి మీడియా ముందే లిప్ కిస్ ఇవ్వడం వైరల్ గా మారడంతో పలువురు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. శ్రియ ఈ ట్రోల్స్ పై స్పందిస్తూ.. ”దీంట్లో నన్ను విమర్శించడానికి ఏముందో నాకు అర్ధం కావడం లేదు. నా భర్తని నేను ముద్దు పెట్టుకుంటే తప్పా. నా భర్తకి నేను ముద్దిస్తే అది తప్పేలా అవుతుందో నాకు తెలీదు. ముద్దుని కూడా ఇంత విడ్డురంగా చూసేవాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. విమర్శించేవాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. దాన్ని చూసి చూడనట్టు వదిలేయాలి. ఎవరేమనుకున్నా నా మనసుకి నచ్చినట్టు నేను ఉంటాను” అని తెలిపింది.

Janhvi Kapoor : నాపై ట్రోలింగ్ కి ఆ నిర్మాతే కారణం..

అలాగే శ్రియ భర్త గురించి చెప్తూ.. ”మా ఆయనకి నేను నటించిన సినిమాలు అంటే ఇష్టం. ఇటీవల వచ్చిన RRR, దృశ్యం 2 సినిమాలు బాగా నచ్చాయి. కాకపోతే ఆయనకి భాష వల్ల సరిగ్గా అర్ధం కాదు. అందుకే నా సినిమాలు మళ్ళీ మళ్ళీ చూస్తారు. నేను కూడా సన్నివేశాలని తనకి అర్థమయ్యేలా చెప్తాను” అని తెలిపింది.