Shriya Saran: చెలరేగిపోతున్న శ్రియా.. హవ్వ పబ్లిక్‌లో ముద్దులా?!

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ వంటి సీనియర్ హీరోల నుండి అల్లరి నరేష్, శర్వానంద్, తరుణ్ వంటి యంగ్ హీరోల వరకు అందరితో నటించేసింది హీరోయిన్ శ్రియా. ఒక తెలుగులోనే కాదు కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఇలానే రెండు జనరేషన్ హీరోలతో ఆడిపాడిన శ్రియా 2018లో ఆండ్రు కొశ్చివ్ అనే రష్యా వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని కాస్త సినిమాలకు దూరంగా సంసారం జీవితాన్ని ఎంతగా అనుభవించాలో అంతకు మించి ఆస్వాదిస్తోంది.

Shriya Saran: చెలరేగిపోతున్న శ్రియా.. హవ్వ పబ్లిక్‌లో ముద్దులా?!

Facebook Recovered

Shriya Saran: చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ వంటి సీనియర్ హీరోల నుండి అల్లరి నరేష్, శర్వానంద్, తరుణ్ వంటి యంగ్ హీరోల వరకు అందరితో నటించేసింది హీరోయిన్ శ్రియా. ఒక తెలుగులోనే కాదు కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఇలానే రెండు జనరేషన్ హీరోలతో ఆడిపాడిన శ్రియా 2018లో ఆండ్రు కొశ్చివ్ అనే రష్యా వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని కాస్త సినిమాలకు దూరంగా సంసారం జీవితాన్ని ఎంతగా అనుభవించాలో అంతకు మించి ఆస్వాదిస్తోంది.

అప్పటి వరకు చూపులతోనే కుర్రాళ్లపై మత్తుమందు చల్లిన శ్రియా అలా పెళ్లి చేసుకొనేసరికి కాస్త నొచ్చుకున్న పోరగాళ్లందరూ శ్రియా పాత సినిమాల ఊసులలో గడిపేస్తున్నారు. కానీ శ్రియా మాత్రం ఊరికే వదిలేస్తే ఎలా అనుకుందో ఏమో సోషల్ మీడియా వేదికగా హీటెక్కించే ఫోజులతో కుర్రకారుని బానిసలు చేసుకుంటూనే ఉంది. అసలే ఒకపక్క హాట్ ఫోజులకు తాళలేక చస్తుంటే భర్తతో రొమాన్స్ వీడియోలు, ఫోటోలు కూడా పోస్ట్ చేసి ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది.

పెళ్ళై మూడేళ్లు దాటినా ఈ జంట మాత్రం ఇప్పటికీ రొమాన్స్ లో మునిగితేలుతూ ఆ ఊసులను నెటిజన్లతో కూడా పంచుకుంటున్నారు. అలా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టులు ఇప్పుడు నెట్టింట మంటలు రేపుతున్నాయి. అందాల జలపాతంలో భర్త ఆండ్రు కొశ్చివ్ ఒడిలో కూర్చున్న శ్రియా తనని రెచ్చగొడుతుంటే అతను రెచ్చిపోయి ముద్దులు పెట్టేస్తున్నాడు. ఇంతలా రొమాన్స్ తో నిండిన ఈ వీడియోలను సోషల్ మీడియా సైట్లు ఎలా అనుమతులు ఇస్తున్నాయో ఏమో కానీ ఇలా భార్యాభర్తల రొమాన్స్ కూడా ప్రపంచానికి చెప్పుకోవాలా అని కొందరు కామెంట్ల ద్వారానే ఏకిపారేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)