SIIMA : 10 కేటగిరీల్లో మహేష్ మూవీ.. తర్వాతి ప్లేస్‌లో చైతు – నాని..

‘సైమా’ 2019 అవార్డ్స్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ ఏకంగా 10 కేటగిరీల్లో నామినేషన్స్ సాధించడం విశేషం..

SIIMA : 10 కేటగిరీల్లో మహేష్ మూవీ.. తర్వాతి ప్లేస్‌లో చైతు – నాని..

Maharshi

SIIMA: ‘సైమా’.. (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్).. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇండస్ట్రీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఇవి. ఏటా దుబాయ్‌లో అంగరంగవైభవంగా ఈ అవార్డ్స్ ఈవెంట్ చేస్తుంటారు. నాలుగు భాషలకు చెందిన స్టార్స్ అంతా ఒకే వేదికపై కనిపించి ప్రేక్షకాభిమానులను ఎంటర్‌టైన్ చేస్తుంటారు.

Prakash Raj : మెగాస్టార్‌ని మీట్ అయిన ప్రకాష్ రాజ్..

అయితే కోవిడ్ కారణంగా గత మూడేళ్లుగా ‘సైమా’ అవార్డ్స్ వేడుక నిర్వహించడం లేదు. త్వరలో హైదరాబాద్‌లో 2019 సంవత్సరానికి గానూ అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించిన నామినేషన్స్ అనౌన్స్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ ఏకంగా 10 కేటగిరీల్లో నామినేషన్స్ సాధించడం విశేషం.

‘మహర్షి’ (తెలుగు), ధనుష్ నటించిన ‘అసురన్’ (తమిళ్), దర్శన్ ‘యజమాన’ (కన్నడ), ఫాహద్ ఫాజిల్ ‘కుంబలంగి నైట్స్’ (మలయాళం) సినిమాలు నామినేషన్‌లో ముందంజలో ఉన్నాయి.

Mahesh Babu

‘మహర్షి’ నామినేషన్స్‌లో నిలిచిన కేటగిరీలు..
బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్), బెస్ట్ విలన్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. ఈ విభాగాల్లో ‘మహర్షి’ మూవీ నామినేషన్స్ సాధించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు, అశ్వనీదత్, పివిపి సినిమా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Majili

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య – సమంత నటించిన స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘మజిలీ’ 9 నామినేషన్లు, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో నాని నటించిన ఫీల్ గుడ్ ఫిలిం.. ‘జెర్సీ’ 7 విభాగాల్లో నామినేషన్స్ సాధించాయి.

Jersey