Sitara Ghattamaneni : సితార పాప మంచితనం.. ముసలివాళ్ళకి చేయి అందించి.. గిఫ్టులు ఇచ్చి.. నవ్వుతూ అందరితో.. వైరల్ అవుతున్న వీడియో..

కొంతమంది ముసలి వాళ్ళని స్టేజి మీదకి పిలవగా ఓ పెద్దావిడ పైకి ఎక్కడానికి కష్టపడుతుంటే సితార కిందకి దిగి స్వయంగా ఆవిడకు చేయి అందిచ్చి పైకి తీసుకొచ్చింది.

Sitara Ghattamaneni : సితార పాప మంచితనం.. ముసలివాళ్ళకి చేయి అందించి.. గిఫ్టులు ఇచ్చి.. నవ్వుతూ అందరితో.. వైరల్ అవుతున్న వీడియో..

Sitara Ghattamaneni Helps to Old age people Sitara Spends time with them Videos goes Viral

Updated On : October 1, 2023 / 8:43 AM IST

Sitara Ghattamaneni :  మహేష్(Mahesh Babu) కూతురిగా అందరికి పరిచయం అయి ఇప్పుడు తన కంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది సితార ఘట్టమనేని. త్వరలో సినిమాల్లోకి వస్తుందని, భవిషత్తులో సితార హీరోయిన్ అవుతుందని మహేష్, నమ్రత(Namrata Shirodkar) గతంలోనే ప్రకటించారు. ఇప్పటికే ఓ కమర్షియల్ యాడ్ లో నటించి మెప్పించింది. తండ్రిలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ, పలువురికి సహాయం చేస్తూ అందర్నీ అబ్బురపరుస్తుంది. 11 ఏళ్ళ వయసులోనే ఫుల్ యాక్టివ్ గా ఉంటూ, కష్టపడుతూ, మంచి పనులకు సపోర్ట్ చేస్తూ అందరికి మార్గదర్శకంగా నిలుస్తుంది సితార.

తాజాగా మరోసారి సితార పాప వైరల్ గా మారింది. మ్యాక్స్ బ్రాండ్ షోరూం హైదరాబాద్ లోని ఓ మాల్ లో ఓపెన్ అవ్వగా ఈ కార్యక్రమానికి గెస్టులుగా నమ్రత శిరోద్కర్ తో పాటు సితార కూడా వెళ్లారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కొంతమంది పేద ముసలి వాళ్లకి మ్యాక్స్(MAX) బ్రాండ్ బట్టలు అందచేసింది. అవి సితార చేతుల మీదుగా అందించారు.

కొంతమంది ముసలి వాళ్ళని స్టేజి మీదకి పిలవగా ఓ పెద్దావిడ పైకి ఎక్కడానికి కష్టపడుతుంటే సితార కిందకి దిగి స్వయంగా ఆవిడకు చేయి అందిచ్చి పైకి తీసుకొచ్చింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. తండ్రి లాగే సితార పాప కూడా చాలా మంచి అమ్మాయి అని పొగడ్తలు కురిపిస్తున్నారు. అలాగే గిఫ్టులు అందించినందుకు ఒక పెద్దావిడ సితార ని ముద్దు పెట్టుకొని ఆశీర్వదించింది. అక్కడున్న పెద్దవాళ్లందరితో సితార నవ్వుతూ, షేక్ హ్యాండ్స్ ఇస్తూ చక్కగా మాట్లాడింది. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారింది.

Also Read : Rathika Rose : బిగ్‌బాస్ నుంచి ఈ వారం హాట్ బ్యూటీ ఎలిమినేట్ అవ్వబోతుందా? టాప్ లో ఉంటుంది అనుకున్నారు..

సితార ఇలా రోజు రోజుకి మరింత ఎదుగుతూ, మంచి పనులు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తుందని అటు అభిమానులు, ఇటు నెటిజన్లు సంతోషిస్తూ ఆమెపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.