సెన్సార్ వల్ల పోస్ట్‌పోన్ అయిన సినిమా ‘శివ 143’

సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి తదితరులు నటించిన ‘శివ 143’ ఫిబ్రవరిలో విడుదల..

  • Published By: sekhar ,Published On : January 24, 2020 / 10:36 AM IST
సెన్సార్ వల్ల పోస్ట్‌పోన్ అయిన సినిమా ‘శివ 143’

సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి తదితరులు నటించిన ‘శివ 143’ ఫిబ్రవరిలో విడుదల..

 

సంక్రాంతికి విడుదల చేయడానికి అన్నీ సిద్ధం చేసాం కానీ సెన్సార్ వారు చూడని కారణంగా సంక్రాంతికి మా సినిమాని విడుదల చేయలేక పోయాం.. అంటున్నారు నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ.. డిస్ట్రిబ్యూటర్స్ లేక థియేటర్స్ లేక ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమలు పోస్ట్ పోన్ అవుతాయి కానీ సెన్సార్ వల్ల పోస్ట్ పోన్ అయిన సినిమా ‘శివ 143’ అంటున్నారాయన.

Image result for siva 143
శైలేష్, ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లుగా భీమవరం టాకీస్ బ్యానర్‌లో రామ సత్యనారాయణ నిర్మించిన 98వ చిత్రం “శివ 143’’(ది జర్నీ ఆఫ్ టూ హార్స్) చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయనున్న సందర్బంగా ప్రముఖ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ “శివ 143” మూవీ రిలీజ్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ సమక్షంలో విడుదల చేశారు.
అనంతరం టీజీ వెంకటేష్ మాట్లాడుతూ : ‘భీమవరం టాకీస్ నిర్మించిన ‘శివ143’ మూవీతో రామ సత్యనారాయణ సెంచరీ దాటడానికి దగ్గరలో ఉన్నందున చాలా సంతోషంగా ఉంది.. సెంచరీతో ఆపకుండా రామ సత్యనారాయణ మరెన్నో చిత్రాలు నిర్మించాలి’ అన్నారు..

 

siva 143
నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ : ‘ఇది 98వ చిత్రం.. 100 చిత్రాలకు చేరువలో ఉంది. మా రోశయ్య గారి తరువాత మాకు పెద్ద దిక్కు టి.జి.వెంకటేష్ గారు.. చిన్న వాళ్ళైనా, పెద్ద వాళ్ళైనా పిలిస్తే పలికే దైవం మా టి.జి.వెంకటేష్ గారు. ఈ మధ్యనే ఆయన గారితో ‘పోలీస్ పటాస్’ సినిమా ట్రైలర్ లాంచ్ చేయించి సక్సెస్ ఫుల్‌గా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నాము. మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన టి.జి.వెంకటేష్ గారికి, అలాగే ‘వెంకీ మామ’ నిర్మాతకు మా చిత్ర యూనిట్ తరుపున వారికి అభినందలు తెలుపుతున్నాము’ అని అన్నారు..
నటీనటులు :
సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి..
సాంకేతిక నిపుణులు : 
మ్యూజిక్ : మనోజ్ కుమార్ చేవూరి
ఎడిటర్ : శివ వై ప్రసాద్..
కెమెరామెన్ : సుధాకర్ అక్కినపల్లి
ట్రైలర్ కట్ & సిజీ : నరేన్
పీఆర్ఓ : మధు వి.ఆర్.
నిర్మాత : రామ సత్యనారాయణ.
కథ, స్క్రీన్‌ప్లే, స్టంట్స్, డ్యాన్స్, కొరియోగ్రఫీ, డైరెక్షన్ : శైలేష్ సాగర్.