Prince Movie: బుల్లితెరపై నవ్వులు పూయించేందుకు రెడీ అయిన ప్రిన్స్

తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’ మూవీని ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించడంతో ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు తమిళంలోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఆ అంచనాలను పెంచేలా ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

Prince Movie: బుల్లితెరపై నవ్వులు పూయించేందుకు రెడీ అయిన ప్రిన్స్

Sivakarthikeyan Prince Movie Locks World Television Premiere Date

Prince Movie: తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’ మూవీని ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించడంతో ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు తమిళంలోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఆ అంచనాలను పెంచేలా ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

Prince : జాతిరత్నాలు డైరెక్టర్ మరో ఫన్ రైడ్ సినిమా ‘ప్రిన్స్’.. ఓటీటీలోకి వచ్చేసింది..

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి మార్కులు సాధించింది. ఈ సినిమాలోని కామెడీతో అనుదీప్ మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. శివకార్తికేయన్ చేసిన కామెడీ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఇక ఈ సినిమాకు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఆడియెన్స్ కూడా మంచి రెస్పాన్స్ ఇవ్వడంతో ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. కాగా, ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై ప్రేక్షకులను నవ్వించేందుకు రెడీ అవుతోంది.

Prince Movie: ఓటీటీలోకి దిగుతున్న ప్రిన్స్.. వచ్చేది ఎప్పుడంటే?

ప్రముఖ ఛానల్ ‘స్టార్ మా’లో ‘ప్రిన్స్’ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను జనవరి 29న మధ్యాహ్నం 1 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్రలో నటించగా, థమన్ సంగీతం అందించాడు.