Small Movies : ఆసక్తి పెంచుతున్న చిన్న సినిమాలు..

టాప్ స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్, ఏమాత్రం కాంప్రమైజ్ కాని ప్రొడక్షన్ వాల్యూస్, అంతకుమించి కమర్షియల్ ఎలిమెంట్స్.. ఇవన్నీ ఉన్న పెద్ద సినిమాల మీద ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చెయ్యడంలో ఆశ్చర్యం లేదు . కానీ ఇలాంటివేం లేకుండా..........

Small Movies : ఆసక్తి పెంచుతున్న చిన్న సినిమాలు..

Small Movies :  టాప్ స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్, ఏమాత్రం కాంప్రమైజ్ కాని ప్రొడక్షన్ వాల్యూస్, అంతకుమించి కమర్షియల్ ఎలిమెంట్స్.. ఇవన్నీ ఉన్న పెద్ద సినిమాల మీద ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చెయ్యడంలో ఆశ్చర్యం లేదు . కానీ ఇలాంటివేం లేకుండా జస్ట్ కంటెంట్ తో, టాలెంట్ తో ఆడియన్స్ లో ఆసక్తి కలిగిస్తున్నాయి చిన్న సినిమాలు. పెద్ద సినిమా అనౌన్స్ చేసినా, అది రిలీజ్ అవుతున్నా చేసే సందడి అంతా ఇంతా కాదు. కోట్లు ఖర్చుపెట్టి ప్రొడక్షన్ దగ్గరనుంచి ప్రమోషన్ల వరకూ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. పెద్ద సినమాల మీద ఆటోమేటిక్ గా ఆడియన్స్ కాన్సన్ ట్రేట్ చేస్తారు. కానీ ఇప్పుడు అదే రేంజ్ లో టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి చిన్న సినిమాలు. అలాంటి చిన్న సినిమాలు ఇప్పుడు రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి.

లేటెస్ట్ గా రిలీజ్ అయిన అల్లరి నరేశ్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ ప్రేక్షకుల్లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. నాందికి ముందు, నాంది తర్వాత అన్నట్టుగా కెరీర్ మారిపోయిన నరేష్ కంటెంట్ సినిమాలు చేస్తున్నారు. టీజర్ తోనే ఈ సినిమా ఆసక్తి పెంచుతుంది.

అప్పుడెప్పుడో 8 ఏళ్ల క్రితం కార్తికేయ సినిమా చేసి మంచి హిట్ అందుకున్న నిఖిల్ మళ్లీ అదే సినిమా సీక్వెల్ తో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాడు. చిన్న హీరో అయినా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కార్తికేయ 2 రిలీజ్ అయిన టీజర్ తో బాలీవుడ్ లో కూడా అంచనాల్ని పెంచేసింది. అందుకే ఈ సనిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కోట్లలోనే జరుగుతోంది.

మాంచి ఇంట్రస్టింగ్ గా కనిపిస్తున్న మరో సినిమా రంగరంగవైభవంగా. ఉప్పెనతో పేరు తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్ ఏ జానర్ కి పరిమితం కాకుండా సినిమాలు చేస్తున్నాడు. ఫస్ట్ 2 సినిమాలు ప్రయోగాలు చేసిన ఈ యంగ్ హీరో మూడో సినిమాతో యూత్ ని టార్గెట్ చేస్తున్నాడు. వైష్ణవ్ ఫుల్ ఫ్లెడ్జ్ లవ్ యాంగిల్ ని ఎలా చూపించబోతున్నాడో అంటూ రంగరంగ వైభవంగా సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.

Tollywood : సెకండాఫ్ సంగతేంటి?? అప్పుడే సగం ఫిక్స్..

వింటేజ్ టైటిల్ తోనే ఆడియన్స్ కి కనెక్ట్ అయిన మరో సినిమా స్వాతిముత్యం. టాలీవుడ్ కి ఇంకా ఎంట్రీ ఇవ్వకుండానే జస్ట్ టైటిల్ తోనే ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాడు బెల్లంకొండ గణేష్. వర్ష హీరోయిన్ గా గణేష్ అమాయకపు హీరోగా తెరకెక్కుతున్న స్వాతిముత్యం సినిమా లవ్ స్టోరీని డిఫరెంట్ గా చూపిస్తోంది. రిలీజ్ అయిన టీజర్ తో పాటు రీసెంట్ గా వచ్చిన పాటలు ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

మత్తువదలరా సినిమాతో అప్పట్లో సరికొత్త సినిమా చేసిన నితీష్ రానా మళ్లీ తన డిఫరెంట్ టేకింగ్ తో హ్యాపీ బర్త్ డే మూవీ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తోంది. రిలీజ్ అయిన ట్రైలర్, ప్రమోషన్లతో సినమా మీద బాగా బజ్ క్రియేట్ అయింది.

అన్ని జానర్స్ ట్రై చేస్తున్నా కానీ నిఖిల్ లవ్ స్టోరీస్ కి క్రేజ్ ఎక్కువే. అది కూడా సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన డైరెక్టర్ అయితే ఆ లవ్ స్టోరీ డెప్త్, డిమాండ్ ఎక్కువ. నిఖిల్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న క్యూట్ లవ్ స్టోరీ 18పేజెస్ రిలీజ్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

ఈ మధ్య వరసగా ప్రయోగాలు చేస్తూ కాస్త బ్రేక్ తీసుకున్న నాగశౌర్య గెటప్ వైజ్, లుక్ వైజ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా కృష్ణ వ్రిందా విహారి. నాగశౌర్య తన సినిమాలన్నింటికన్నా డిఫరెంట్ గా కనిపిస్తున్న ఈ క్యూట్ లవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎలా ఉండబోతోందో, శౌర్య కొత్తగా ఏం కథ చెప్పబోతున్నాడో అని ఆడియన్స్ వెయిటింగ్.