RC15: సక్సెస్, ఫెయిల్యూర్ లెక్కేలేదు.. చెర్రీ బిజీ బిజీ! Success and failure do not count to Ram Charan.. Busy with RC15

RC15: సక్సెస్, ఫెయిల్యూర్ లెక్కేలేదు.. చెర్రీ బిజీ బిజీ!

సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా, తన పని తాను చేసుకుంటూ పోతే రిజల్ట్ దానంతటదే వస్తుందని స్ట్రాంగ్ గా బిలీవ్ చేసే స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ట్రపుల్ ఆర్ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఆచార్య ఫ్లాప్.. చరణ్ వర్క్ మూడ్ ని ఏ మాత్రం డిస్ట్రబ్ చేయలేదు.

RC15: సక్సెస్, ఫెయిల్యూర్ లెక్కేలేదు.. చెర్రీ బిజీ బిజీ!

RC15: సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా, తన పని తాను చేసుకుంటూ పోతే రిజల్ట్ దానంతటదే వస్తుందని స్ట్రాంగ్ గా బిలీవ్ చేసే స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ట్రపుల్ ఆర్ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఆచార్య ఫ్లాప్.. చరణ్ వర్క్ మూడ్ ని ఏ మాత్రం డిస్ట్రబ్ చేయలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజి బిజీగా గడిపేస్తున్నారు. ఎప్పటికప్పుడు మెగా ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేయడంలో ముందుంటున్నారు.

Ram Charan : పంజాబ్ లో RC15 షూట్.. RRR ఎఫెక్ట్.. చరణ్‌తో ఫోటోల కోసం పంజాబ్ పోలీసుల క్యూ..

ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా సక్సెస్ కు పొంగిపోలేదు.. ఆచార్య డిజాస్టర్ కు కృంగి పోలేదు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఈక్వల్ గా రిసీవ్ చేసుకునే స్వభావం మెగా హీరో రాంచరణ్ కుంది.. అందుకే తన పదిహేనో సినిమాని.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో చేస్తూ ఇప్పుడు.. ఆ సినిమా షూటింగ్‌లోనే బిజీగా ఉన్నాడు చెర్రీ.. ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత చరణ్ కి సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి.. ఇప్పటి వరకూ ఏ బాలీవుడ్ సినిమాకు ఓకె చెప్పలేదు కాని, తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు చెర్రీ.

RC15: శంకర్ హై క్వాలిటీ మేకింగ్.. తడిసి మోపెడవుతున్న బడ్జెట్!

ఆల్రెడీ మూడు షెడ్యూల్స్ ఫినిష్ చేసుకున్న శంకర్ చరణ్ కాబినేషన్ సినిమా ఫోర్త్ షెడ్యూల్ వైజాగ్ లో శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ కాలేజ్ సీన్స్ తో పాటు, ఓ అల్ట్రా మాస్ సాంగ్ నూ తెరకెక్కిస్తున్నారు. ఆ సాంగ్ లో తమన్ మాస్ బీట్స్ కి చరణ్ ఊరమాస్ స్టెప్పులు హైలెట్ కానున్నాయని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో చరణ్ వర్క్ చేయబోతున్నాడు.

Ram Charan : ఒక్క పాటకి 20 కోట్లు.. RC15లో మరో అద్భుతం సృష్టించనున్న శంకర్..

రీసెంట్ గా మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చరణ్ షూటింగ్ జరుగుతుందని తెలియడంతో భారీ సంఖ్యలో తన అభిమనులు షూటింగ్ స్పాట్ చేరుకున్నారు. షూటింగ్ బ్రేక్ టైమ్ లో తన ఫ్యాన్స్ కు సెల్ఫీలిచ్చి ఖుషి చేశారు పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్. శంకర్ డైరెక్షన్‌లో.. కాలేజీ స్టూడెంట్ గానూ, ఎలక్షన్ కమిషనర్‌గా టూ షేడ్స్ లో నటించబోతున్నారు రామ్ చరణ్ తేజ్. ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్న దిల్ రాజు.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సో ఆచార్య డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ కి శంకర్ సినిమాతో మరో పాన్ ఇండియా సక్సెస్ వచ్చినట్టే అని ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు మెగా ఫ్యాన్స్.

×