Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్..
టాలీవుడ్ గూఢచారి, కౌబాయ్ కృష్ణ ఇక లేరు. సోమవారం ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం వల్ల హైదరాబాద్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. కార్డియాక్ అరెస్ట్ తో ఈరోజు ఉదయం సుమారు 4 గంటల సమయంలో అయన తుదిశ్వాస విడిచారు. ఇక కృష్ణ గారి సినిమా కెరీర్ కి వస్తే..

Super Star Krishna Cinema Career
Super Star Krishna : టాలీవుడ్ గూఢచారి, కౌబాయ్ కృష్ణ ఇక లేరు. సోమవారం ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం వల్ల హైదరాబాద్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. కార్డియాక్ అరెస్ట్ తో ఈరోజు ఉదయం సుమారు 4 గంటల సమయంలో అయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన అభిమానులు, టాలీవుడ్ ప్రముఖులు అయన హఠాన్మరణాన్నికి సంతాపం తెలియజేస్తున్నారు.
ఇక కృష్ణ గారి సినిమా కెరీర్ కి వస్తే.. 5 దశాబ్దాలో 350కి పైగా సినిమాల్లో నటించి అలరించారు. టాలీవుడ్ లో గూఢచారి, కౌబాయ్, అల్లూరి సీతారామరాజు పాత్రలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ కృష్ణ. 1965లో తేనెమనసులు సినిమాతో వెండితెర అరగేంట్రం చేసిన కృష్ణ.. మూడో సినిమా గూఢచారి 116 తో చెరిగిపోని గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరువాత మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, మంచి కుటుంబం, రామ్ రాబర్ట్ రహీమ్, ముందడుగు మరియు సింహాసనం వంటి సినిమాలతో చరిత్ర సృష్టించారు.
అంతేకాదు తెలుగులో ఫస్ట్ సినిమా స్కోప్ పిక్చర్ – అల్లూరి సీతారామరాజు, ఫస్ట్ 70MM – సింహాసనం, ఫస్ట్ కౌబాయ్ – మోసగాళ్లకు మోసగాడు, ఫస్ట్ జేమ్స్ బాండ్ – గూఢచారి 116 ఇలా ఎన్నో ప్రయోగాలు చేసి తెలుగుతేరపై గట్స్ ఉన్న హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక అయన తనయులు రమేష్ బాబు, మహేష్ బాబులతో కూడా కలిసి పలు సినిమాల్లో నటించారు.
అలాగే నిర్మాతగా పద్మాలయ స్టూడియోస్ స్థాపించి పలు చిత్రాలను నిర్మించిన కృష్ణ.. 16 సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇప్పుడు నటులకి ఏడాదికి ఒక సినిమా కూడా తియ్యడం కష్టం అవుతుంటే, కృష్ణ గారు నటుడిగా 1972లో దాదాపు 18 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించాడు.