సూపర్ ఉబర్ లుక్‌లో సూపర్ స్టార్!

వావ్ మ్యాగజైన్ 17వ వార్షికోత్సవం సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ ఫోటోతో కూడిన కవర్ పేజీని రూపొందించారు..

  • Published By: sekhar ,Published On : December 4, 2019 / 06:04 AM IST
సూపర్ ఉబర్ లుక్‌లో సూపర్ స్టార్!

వావ్ మ్యాగజైన్ 17వ వార్షికోత్సవం సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ ఫోటోతో కూడిన కవర్ పేజీని రూపొందించారు..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’  సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలతో పాటు పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తుంటాడు సూపర్ స్టార్..

 మధ్యలో కొన్ని మ్యాగజైన్‌ల కోసం స్పెషల్ ఫోటో షూట్స్‌లో పాల్గొంటుంటాడు. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ‘వావ్’ యొక్క 17వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించబడిన ఎడిషన్‌కు సూపర్ స్టార్ మహేష్ స్పెషల్ ఫోటోతో కూడిన కవర్ పేజీని రూపొందించడం విశేషం.

 

డిసెంబర్ సంచికగా అతి త్వరలో ఈ మ్యాగజైన్ మార్కెట్‌లో లభ్యం కానుంది. కాగా ఆ కవర్ పేజీ లుక్‌లో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ సూట్‌లో అదరిపోయాడు . ప్రస్తుతం ఆయన కవర్ పేజీ ఉన్న పిక్ పలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది..