AP Online Ticketing : ఇలా అయితే కష్టం.. ఏపీ సినిమా టికెట్ల అంశంపై స్పందించిన నిర్మాత సురేష్‌బాబు

ఏపీ సినిమా టిక్కెట్ రేట్స్ విధానంపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందించారు. ప్రస్తుత టిక్కెట్ రేట్లు వల్ల నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, టిక్కెట్ రేట్లపై ప్రభుత్వం.......

AP Online Ticketing : ఇలా అయితే కష్టం.. ఏపీ సినిమా టికెట్ల అంశంపై స్పందించిన నిర్మాత సురేష్‌బాబు

Suresh Babu

AP Online Ticketing :  ఏపీలో గత కొద్ది నెలలుగా సినీ పరిశ్రమ, థియేటర్స్ సమస్యలపై చర్చలు నడుస్తున్నాయి. సినీ పెద్దలు ఏపీ సీఎం, మంత్రులని కలుస్తున్నారు. అయినా సినిమా ఇండస్ట్రీ విషయంలో సీఎం జగన్ తన తీరు మార్చట్లేదు. ఆయన తీసుకున్న నిర్ణయాలు నష్టాన్ని కలిగించేలా ఉన్నాయి తప్ప, ఎవరికీ లాభం చేకూర్చేలా లేవు. తాజాగా సినీ నియంత్రణ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయాన్ని మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఇకపై బెనిఫిట్ షోలు, ఎక్సట్రా షోలు ఉండవని చెప్తూ టికెట్ రేట్లు కూడా భారీగా తగ్గించారు. అయితే ఇది సినీ పరిశ్రమకి పెద్ద దెబ్బే.

Bigg Boss Vishwa : బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాడు.. బిఎం‌డబ్ల్యు కార్ కొన్నాడు

దీనిపై సినీ పరిశ్రమ నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని, ఇలా అయితే సినిమా పరిశ్రమకి చాలా నష్టం చేకూరుతుందని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా టికెట్ రేట్లు పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. వీటిపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ సీఎం ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్నారు. అవి అయ్యాక చర్చిస్తామని అన్నారు.

Bigg Boss 5 : తండ్రి లేని కూతురని దగ్గరై అడ్వాంటేజ్‌ తీసుకోలేదని మీ అమ్మకు చెప్పు

తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత స్పందించారు. ఏపీ సినిమా టిక్కెట్ రేట్స్ విధానంపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందించారు. ప్రస్తుత టిక్కెట్ రేట్లు వల్ల నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, టిక్కెట్ రేట్లపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలి అని అన్నారు. కరోనా వల్ల ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడమే చాలా కష్టంగా ఉంది, కనీసం కరెంటు చార్జీలు కూడా వచ్చే అవకాశాలు లేవు ఇలాంటి టైంలో ప్రభుత్వం ఇలా టికెట్ రెట్లని తగ్గించడం సరి కాదు అన్నారు. దీనిపై మరోసారి ఆలోచించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.