Tamannaah : సొసైటీలో ప్రతి అమ్మాయి పెళ్లి విషయంలో ఒత్తిడిని ఎదుర్కోవాల్సిందే.. తమన్నా!

మిల్కీ బ్యూటీ తమన్నా తన పెళ్లిపై వస్తున్న వార్తల గురించి స్పందించింది. ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. విడుదల దగ్గర పడడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే తమన్నాని తన పెళ్లిపై వస్తున్న వార్తలు గురించి ప్రశ్నించగా..

Tamannaah : సొసైటీలో ప్రతి అమ్మాయి పెళ్లి విషయంలో ఒత్తిడిని ఎదుర్కోవాల్సిందే.. తమన్నా!

Tamannaah comments on marriage

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా తన పెళ్లిపై వస్తున్న వార్తల గురించి స్పందించింది. ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా విడుదల ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరిగా విడుదల తేదీని ఖరారు చేసుకొని, ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం కన్నడ సినిమా ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్ గా వస్తుంది.

Tamannaah : తన కాబోయే భర్తని పరిచయం చేసిన తమన్నా.. చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు..

ఇక విడుదల దగ్గర పడడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించగా, హీరోహీరోయిన్లు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమన్నాని తన పెళ్లిపై వస్తున్న వార్తలు గురించి ప్రశ్నించగా.. “సొసైటీలో ప్రతి అమ్మాయి పెళ్లి విషయంలో ఒత్తిడిని ఎదుర్కోవాల్సిందే, అందులో నేను ఒక కూడా ఉన్నా.

నా తల్లిదండ్రులు కూడా నన్ను ఈ విషయం గురించి నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నారు. సంబంధాలు కూడా చూస్తున్నారు, కానీ నేను ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఇక సోషల్ మీడియా పుకార్లు అంటారా.. అలాంటివి రాయడం వాళ్ళ పని, నటించడం నా పని. కాబట్టి నేను ఆ వ్యాఖ్యలను అంత సీరియస్‌గా తీసుకోను” అంటూ వెల్లడించింది.