O Manchi Ghost : ‘ఓ మంచి ఘోస్ట్’ పోస్టర్ గ్లింప్స్ రిలీజ్.. మరో హారర్ కామెడీ సినిమా..

మరో హారర్ కామెడీ సినిమా రాబోతుంది. టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉంది.

O Manchi Ghost : ‘ఓ మంచి ఘోస్ట్’ పోస్టర్ గ్లింప్స్ రిలీజ్.. మరో హారర్ కామెడీ సినిమా..

Nanditha Swetha Vennela Kishore O Manchi Ghost Poster Glimpse Released

Updated On : May 1, 2024 / 6:58 PM IST

O Manchi Ghost : ఇటీవల హారర్ సినిమాలు, హారర్ కామెడీ సినిమాలు బాగానే సక్సెస్ అవుతున్నాయి. గీతాంజలి మళ్ళీ వచ్చింది అని ఇటీవలే ఓ హారర్ కామెడీ సినిమా వచ్చి హిట్ కొట్టింది. ఇప్పుడు మరో హారర్ కామెడీ సినిమా రాబోతుంది. టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉంది. వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని.. పలువురు ముఖ్య పాత్రల్లో శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’.

మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబతుని నిర్మాణాల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం ఇస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా పోస్టర్ గ్లింప్స్, కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇవి చూస్తుంటే ఇది మంచి హారర్ కామెడీ సినిమా అవ్వబోతుందని తెలుస్తుంది. మరి ఇది ఎంత మంచి దయ్యామో సినిమాలో చూడాలి.

Nanditha Swetha Vennela Kishore O Manchi Ghost Poster Glimpse Released

ఇక ఈ ఓ మంచి ఘోస్ట్ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించనున్నారు. ఈ పోస్టర్ గ్లింప్స్ మీరు కూడా చూసేయండి.