Tamannaah : ఆ నటుడితో తమన్నా డేటింగ్.. నిజమేనా?

గత కొన్ని రోజులుగా మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి వార్తలపై రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. దీనిపై తమన్నా కూడా వివరణ ఇస్తూనే వస్తుంది. తాజాగా ఈ భామకు సంబంధించిన న్యూ ఇయర్ వీడియో ఒకటి బయటకి వచ్చింది. ఆ వీడియోలో తమన్నా ఒక వ్యక్తిని కౌగిలించుకొని, ముద్దాడుతూ కనిపిస్తుంది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తమన్నా ఆ వ్యక్తితో డేటింగ్ లో ఉంది అంటూ బాలీవుడ్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Tamannaah : ఆ నటుడితో తమన్నా డేటింగ్.. నిజమేనా?

Tamannaah dating with vijay varma

Tamannaah : గత కొన్ని రోజులుగా మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి వార్తలపై రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. దీనిపై తమన్నా కూడా వివరణ ఇస్తూనే వస్తుంది. తాజాగా ఈ భామకు సంబంధించిన న్యూ ఇయర్ వీడియో ఒకటి బయటకి వచ్చింది. ఆ వీడియోలో తమన్నా ఒక వ్యక్తిని కౌగిలించుకొని, ముద్దాడుతూ కనిపిస్తుంది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తమన్నా ఆ వ్యక్తితో డేటింగ్ లో ఉంది అంటూ బాలీవుడ్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Tamannaah : రొమాంటిక్ సన్నివేశాల్లో హీరోలు అలా ఉంటారు.. చాలా కష్టం..

ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే.. నేచురల్ స్టార్ నాని నటించిన MCA సినిమాలో విలన్ గా కనిపించిన ‘విజయ్ వర్మ’. గోవాలో స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు విజయ్ వర్మ, తమన్నా హాజరయ్యారు. ఈ సెలెబ్రేషన్స్ లో తమన్నా పింక్ డ్రెస్ లో కనిపించగా, విజయ్ వైట్ డ్రెస్ లో ఉన్నాడు. ఆ పార్టీలో 2023కి బాణాసంచాతో వెల్కమ్ చెబుతున్న సమయంలో ఒక వ్యక్తి వీడియో తీశాడు.

ఆకాశంలో బాణాసంచా పేలుతున్న దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఆ వీడియోకి.. ఇద్దరు వ్యక్తులు కొగిలించుకొని ముద్దు పెట్టుకోవడం కనిపించింది. ఆ ఇద్దరి వ్యక్తులు పింక్ అండ్ వైట్ డ్రెస్ లో ఉండడంతో, వారిద్దరూ తమన్నా అండ్ విజయ్ వర్మ అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఈ జంట స్పందించలేదు. మరి ఈ వార్తలు నిజామా? లేదా? అనేది చూడాలి.