Tamannaah: తగ్గేదేలే.. క్రేజీ రికార్డ్ మిల్కీ బ్యూటీ సొంతం!

తమన్నా పనైపోయింది. అందుకే ఐటమ్ సాంగ్స్ చేసింది, ఓటీటీ లకి వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇక మళ్లీ స్టార్ హీరోలతో సినిమా దక్కించుకునే ఛాన్సే లేదు అనుకున్న వాళ్లకి.. మెగాస్టార్ తో మరో..

Tamannaah: తగ్గేదేలే.. క్రేజీ రికార్డ్ మిల్కీ బ్యూటీ సొంతం!

Tamannaah (image : Instagram)

Tamannaah: తమన్నా పనైపోయింది. అందుకే ఐటమ్ సాంగ్స్ చేసింది, ఓటీటీ లకి వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇక మళ్లీ స్టార్ హీరోలతో సినిమా దక్కించుకునే ఛాన్సే లేదు అనుకున్న వాళ్లకి.. మెగాస్టార్ తో మరో సినిమా ఛాన్స్ కొట్టేసి ఇంకా లైమ్ లైట్ లోనే ఉన్నానంటోంది తమన్నా. అంతేకాదు.. వరుస పెట్టి మెగాఫ్యామిలీ స్టార్ హీరోలందరి సరసననటించి క్రేజీ రికార్డ్ సొంతం చేసుకుంటోంది ఈ మిల్కీ బ్యూటీ.

Samantha: లైఫ్ గురించి సామ్ చెప్పిన కొత్త నిర్వచనం.. పోస్ట్ వైరల్!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాప్ హీరోలందరితో సినిమాలు చేసిన తమన్నా ఆ మధ్య కాస్తస్లో అయినా ఈ మధ్య మళ్లీ పికప్ అయ్యి బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లు దక్కించుకుంటోంది. లేటెస్ట్ గా మెగాస్టార్ తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే ఆఫర్ కొట్టేసింది ఈ మిల్కీ బ్యూటీ. చిరంజీవి, తమన్నా అంతకుముందు సైరా నర్సింహారెడ్డి సినిమాలో చేసినా కూడా మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా చెయ్యలేదు. అందుకే ఇప్పుడు మెహర్ రమేష్ డైరెక్షన్లో చిరంజీవి చేస్తున్న భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ పక్కన హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.

RRR: జక్కన్న నాటు ప్రమోషన్స్.. దెబ్బకి సోషల్ మీడియా షేక్!

చిరంజీవి తోనేకాదు.. మెగా ఫ్యామిలీ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది తమన్నా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గంగతో రాంబాబు సినిమా చేసి తనలోని డిఫరెంట్ యాంగిల్ ని చూపించింది తమన్నా.. బాబాయ్ తోనే కాకుండా అబ్బాయ్ తో కూడా సినిమా చేసింది. అప్పట్లో స్టార్ హీరోయిన్ అయిన తమన్నాతో చరణ్ చేసిన రచ్చ మూవీలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ సూపర్ హిట్ అయ్యింది. స్పెషల్లీ వాన వాన రీమేక్ సాంగ్ కి తమన్నా అదిరిపోయే స్టెప్పులు, చరణ్ ఈజ్ తో ఈ క్రేజీ కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది.

Jai Bhim: చరిత్ర సృష్టించిన జైభీమ్.. 26 ఏళ్ల రికార్డ్ బద్దలు!

మెగా ఫ్యామిలీ సెకండ్ జనరేషన్ నుంచి వచ్చిన మరో హీరో బన్నీతో కూడా తమన్నా స్క్రీన్ షేర్ చేసుకుంది. వినాయక్ డైరెక్షన్లో వచ్చిన బద్రీనాధ్ మూవీలో అల్లు అర్జున్ కి జంటగా నటించిన ఈ మిల్కీ బ్యూటీ. మెగాఫ్యామిలీలో ఏ హీరోలతో నటించినా సినిమా రిజల్ట్ తో సంబందం లేకుండా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసిన తమన్నా.. మెగాస్టార్ తో ఈ సారి ఫుల్ ఫ్లెడ్జ్ హీరోయిన్ గా చేస్తూ.. మెగా ఫ్యామిలీ టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ గా ట్రెండ్ సెట్ చేసింది.