మన ఆడపిల్ల మన బాధ్యత – టీమ్ తారక్ ట్రస్ట్ వినూత్న కార్యక్రమం

‘మన ఆడపిల్ల మన బాధ్యత’ అంటూ వినూత్న కార్యక్రమం చేపడుతున్నారు టీమ్ తారక్ ట్రస్ట్..

  • Published By: sekhar ,Published On : December 5, 2019 / 09:31 AM IST
మన ఆడపిల్ల మన బాధ్యత – టీమ్ తారక్ ట్రస్ట్ వినూత్న కార్యక్రమం

‘మన ఆడపిల్ల మన బాధ్యత’ అంటూ వినూత్న కార్యక్రమం చేపడుతున్నారు టీమ్ తారక్ ట్రస్ట్..

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి అత్యాచార ఘటనతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఈ దుశ్చర్యను ఖండిస్తూ, ఆమెను అత్యంత పాశవికంగా హతమార్చిన మానవ మృగాళ్లను ఉరితీయాలి అంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల రక్షణ కోసం పోలీసు యంత్రాంగం సరికొత్త చర్యలు చేపడుతుంది.

కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ సినిమా పోస్టర్లు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తారక్ నటించిన ‘రాఖీ’, ‘టెంపర్’ సినిమాల్లో సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న దారుణాలను కళ్లకి కడుతూ, నిందితులకు శిక్ష పడడం సబబు అనే అంశాలను తెలియచెప్పిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే మహిళల రక్షణ కొరకు ఎన్టీఆర్ అభిమానులు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టబోతున్నారు. మహిళలు ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవాలో తెలుపుతూ టీమ్ తారక్ ట్రస్ట్ అనంతపురం నుంచి ఓ సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Team Tarak Trust

‘ఆడపిల్ల ఏడుపు ఇంటికే కాదు.. దేశానికే అరిష్టం.. మన ఆడపిల్ల మన బాధ్యత’.. అంటూ రాత్రి వేళల్లో మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ, డీఎస్పీ, మరియు మహిళా పోలీస్ స్టేషన్లతో పాటు హెల్ప్ లైన్ నంబర్స్‌‌‌తో కూడిన 2500 కార్డ్స్ ప్రింట్ చేసి పంపిణీ చేయనున్నారు. టీమ్ తారక్ ట్రస్ట్ వారు చేస్తున్న ఈ మంచి పనికి పలువురు మహిళలు వారిని అభినందిస్తున్నారు..