Telugu Heroin’s: ఎక్కడ ఆఫర్ వస్తే.. అక్కడ వాలిపోతున్న హీరోయిన్లు!

రెండు కాదు ఒక్కొక్కరు మూడు పడవల ప్రయాణం చేస్తున్నారు సౌత్ అందగత్తెలు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్... ఎక్కడ ఏ క్రేజీ ఆఫర్ హాయ్ చేప్తే.. అక్కడ వాలిపోతున్నారు. తెలుగు సినిమాను...

10TV Telugu News

Telugu Heroin’s: రెండు కాదు ఒక్కొక్కరు మూడు పడవల ప్రయాణం చేస్తున్నారు సౌత్ అందగత్తెలు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్… ఎక్కడ ఏ క్రేజీ ఆఫర్ హాయ్ చేప్తే.. అక్కడ వాలిపోతున్నారు. తెలుగు సినిమాను స్టెప్పింగ్ స్టోన్ చేసుకుని.. ఇక్కడి నుంచే పేరు తెచ్చుకుని.. పక్క ఇండస్ట్రీల్లో దుమ్మురేపుతున్నారు. ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంటే.. ఏ ఉడ్ మాత్రం ఎందుకు వదులుకుంటుంది. అందుకే ఛాన్స్ లు మీద ఛాన్స్ లు పిలిచీమరి ఇస్తున్నారు పూజా హెగ్డేకి. తెలుగులో ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. బాలీవుడ్ లో కరెక్ట్ హిట్ పడలేదు కానీ బాగానే పేరుంది. రణ్ వీర్ సింగ్ తో చేస్తోన్న సర్కస్, అమితాబ్ తో సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్, సల్మాన్ ఖాన్ భాయిజాన్ వంటి క్రేజీ బాలీవుడ్ మూవీస్ ఉన్నాయి ఈ బ్యూటీ చేతిలో. వీటిలో ఏ ఒక్కటి బంపర్ హిట్ అయినా పూజాను నార్త్ లో ఆపడం కష్టమే.

Bigg Boss 5: ఇంటి చివరి కెప్టెన్‌గా షణ్ముక్.. పక్కా ప్లాన్ వేసి మరీ!

ఇక తమిళ్ ఇండస్ట్రీ గుర్తింపు కోసం తహతహలాడుతోంది బుట్టబొమ్మ. స్టార్ హీరో విజయ్ తో చేస్తోన్న బీస్ట్ పైనే ఆశలన్నీ పెట్టుకుంది. బీస్ట్ తో తమిళ్ హీరోలందరి పక్కన ఛాన్స్ లు కొట్టేయాలనేది పూజా ప్లాన్. తెలుగులో ప్రభాస్ రాధేశ్యామ్. చిరూ చరణ్ ఆచార్య వన్ మంత్ గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నాయి. అటు త్రివిక్రమ్ తో మూడోసారి, మహేశ్ తో రెండోసారి కొత్త ప్రాజెక్ట్ కోసం జోడీ కట్టబోతుంది. అటు పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబో భవదీయుడు భగత్ సింగ్ లోనూ బుట్టబొమ్మే మెరవనుందనేది దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. మూడు లాంగ్వెజెస్ లో బిజీ కావడమే కాదు సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ను పెంచుకుంటూ స్టార్ డంను పీక్ కు తీసుకెళ్తోంది.

Keerthy Suresh: కీర్తి పిచ్చ క్యూట్ ఫోటోస్!

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో వెలిగిపోవాలని ఫిక్సయింది రష్మికా మందన్నా. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 పార్ట్స్, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేస్తోంది. కొన్ని ప్రాజెక్ట్స్ ను త్వరలోనే అనౌన్స్ చేయనుంది. అందులో మహేశ్ – త్రివికమ్ సినిమా ఉండబోతుందనే హింట్స్ ఉన్నాయి. తమిళ్ లో డైరెక్ట్ గా సుల్తాన్ తర్వాత మరో సూపర్ ఆఫర్ కోసం వెయిట్ చేస్తోంది. అటు బాలీవుడ్ లో సిద్ధార్ధ్ మల్హోత్రా మిషన్ మజ్ను, అమితాబ్ గుడ్ బై మూవీస్ తో బిజీగా ఉంది. ఈమధ్య ఆనంద్ ఎల్ రాయ్ తో పాటూ మరికొందరు డైరెక్టర్స్ తో ఫుల్ గా డిస్కషన్స్ చేస్తోంది. ఏ టైంలో బాలీవుడ్ నుంచి రష్మికపై ఎలాంటి క్రేజీ అప్ డేట్ వచ్చినా ఆశ్చర్యం లేదు.

Peddanna: సందడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్!

నేషనల్ క్రష్… బాలీవుడ్ కి మాత్రమే ఫుల్ ప్రిఫరెన్స్ ఇస్తుందనే పుకార్లు రీసెంట్గా హల్చల్ చేసాయి. కానీ అలాంటిదేమి లేదని బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తూ… పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకోవాలన్నది ఆమె ప్లాన్ అన్నట్టు తెలుస్తోంది. మూడు ఇండస్ట్రీల్లో పూజా హెగ్డే లాంటి వాళ్లు ఆమెకు గట్టి పోటీ ఇస్తుండటంతో డైరెక్ట్ గా రంగంలోకి దిగిన రష్మికా.. డైరెక్ట్ గా డైరెక్టర్స్ తో టచ్ లో ఉంటుంది. ఏదేమైనా సౌత్, నార్త్ అని తేడా లేకుండా రెండు వైపులా సినిమాలను బ్యాలెన్స్ చేయాలన్నదే ఆమెకున్న ఏకైక టార్గెట్ ఇప్పుడు.