Thalaivii : రిలీజ్ డేట్ ఫిక్స్.. చైతు సినిమాకి ఎఫెక్ట్..?

‘తలైవి’ చిత్రాన్ని కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో చైతు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు..

Thalaivii : రిలీజ్ డేట్ ఫిక్స్.. చైతు సినిమాకి ఎఫెక్ట్..?

Thalaivii

Thalaivii : పాండమిక్ తర్వాత థియేటర్లు రీ ఓపెన్‌తో పెండింగ్ సినిమాలను రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు కొత్త డేట్స్ కోసం నానా తిప్పలు పడుతున్నారు. చిన్నా, పెద్దా అన్ని సినిమాలకు రిలీజ్ డేట్స్ విషయంలో క్లాష్ తప్పడం లేదు. నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది.

Kartikeya : ఎంగేజ్‌మెంట్ చేసుకున్న కార్తికేయ..!

అదే రోజు నాని ‘టక్ జగదీష్’ ఓటీటీలో రిలీజ్ అవనుండడంతో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. చివరకు అదే రోజు ఓటీటీలో రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో ‘లవ్ స్టోరీ’ కి గట్టి దెబ్బ వేసింది.

Nani : వేరే దారి లేదు.. ఓటీటీలోనే ‘టక్ జగదీష్’.. ప్రకటించిన నిర్మాతలు..

సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. జయలలిత, విలక్షణ నటుడు అరవింద్ స్వామి.. ఎంజీఆర్ పాత్రల్లో నటిస్తుండగా.. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 10న తెలుగు, తమిళ్, హిందీలో విడుదల చెయ్యబోతున్నామని ప్రకటించారు.

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్నబ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరి’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్నాయి.. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల అన్నారు.

Love Story : వినాయక చవితికి.. చైతు, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’..

కట్ చేస్తే.. ‘తలైవి’ చిత్రాన్ని కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో చైతు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తెలుగుతో పాటు తమిళనాట కూడా ‘లవ్ స్టోరీ’ కి మంచి కలెక్షన్స్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేశారు చైతు ఫ్యాన్స్. జయలలిత బయోపిక్ కావడంతో మెజారిటీ ఆడియెన్స్ రిలీజ్ రోజు చూడ్డానికే మొగ్గు చూపుతారు. ఈ సినిమా మీద తెలుగులోనూ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 10న బాక్సాఫీస్ బరిలో ఏ సినిమా పై చెయ్యి సాధిస్తుందో చూడాలి మరి.