Nani : వేరే దారి లేదు.. ఓటీటీలోనే ‘టక్ జగదీష్’.. ప్రకటించిన నిర్మాతలు..

ఎట్టకేలకు తమ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు.. అందుకు నిర్మాతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి.. ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియా ద్వారా ప్రెస్ నోట్ విడుదల చేశారు..

Nani : వేరే దారి లేదు.. ఓటీటీలోనే ‘టక్ జగదీష్’.. ప్రకటించిన నిర్మాతలు..

Tuck Jagadish

Nani: నేచురల్ స్టార్ నాని హీరోగా.. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘టక్ జగదీష్’.. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లు.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో సెప్టెంబర్ 10న ఓటీటీలో రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు మొగ్గు చూపారు..

Meet Cute : అక్క దర్శకత్వంలో.. ఆరుగురు ఫిమేల్ లీడ్స్‌తో నాని సినిమా..

అదే రోజు నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ థియేటర్లలో విడుదల కానుండడంతో.. ఈ విషయం గురించి చర్చించడానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఫిలిం ఛాంబర్లో సమావేశమయ్యారు. ఓటీటీని ఆశ్రయించడం అంటే థియేటర్ వ్యవస్థను నష్ట పరచడమే.. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ముందు ముందు నాని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చెయ్యం అంటూ కొందరు మాట్లాడడం పెద్ద దుమారం రేపింది. వాళ్లు తర్వాత నానికి సారీ చెప్పారు.

Tuck Jagadish: తగ్గిన నానీ.. ఓటీటీలోనే టక్ జగదీష్!

ఇప్పుడు ఎట్టకేలకు తమ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు.. అందుకు హరీష్ పెద్ది, సాహు గారపాటి.. ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియా ద్వారా ప్రెస్ నోట్ విడుదల చేశారు.

Nani on Theatres : థియేటర్స్‌పై హీరో నాని షాకింగ్ కామెంట్స్

‘‘టక్ జగదీష్’ సినిమా రెండున్నర సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే పలు సార్లు విడుదల వాయిదా పడింది. కష్టాల్లో ఉన్నాం. వేరే దారిలేక ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. దీని గురించి ముందుగానే నాని పర్మిషన్ తీసుకున్నాం. అయితే ఆయన కొన్ని రోజులు వెయిట్ చేద్దామని చెప్పారు. అయినప్పటికీ పరిస్థితులు అనుకూలించ లేదు. దీంతో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ మా ఇబ్బందులను అర్థం చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా మమ్మల్ని, మా పరిస్థితులను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం’’.. అంటూ వివరణ ఇచ్చారు నిర్మాతలు.