SSMB29: మహేష్-రాజమౌళి సినిమాలో ఆ హాలివుడ్ స్టార్ నటుడు.. నిజమేనా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఒక సినిమా రాబోతుందని తెలియగానే.. ఆ సినిమాని ఎప్పుడెప్పుడు తెరకెక్కిస్తారో, ఎప్పుడెప్పుడు చూదామా అని వారి ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి రోజుకో వార్త సినీ వర్గాలలో వినిపిస్తుంది.

SSMB29: మహేష్-రాజమౌళి సినిమాలో ఆ హాలివుడ్ స్టార్ నటుడు.. నిజమేనా?

That Hollywood star actor in Mahesh-Rajamouli movie

SSMB29: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఒక సినిమా రాబోతుందని తెలియగానే.. ఆ సినిమాని ఎప్పుడెప్పుడు తెరకెక్కిస్తారో, ఎప్పుడెప్పుడు చూదామా అని వారి ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి రోజుకో వార్త సినీ వర్గాలలో వినిపిస్తుంది.

SSMB29 : రాజమౌళి-మహేష్ సినిమా అదే.. హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్లో మహేష్ సినిమా గురించి చెప్పిన రాజమౌళి..

ఇక ఇటీవలే రాజమౌళి మహేష్ సినిమా ఎలా ఉండబోతుందో అని.. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా కోసం రాజమౌళి ఒక హాలీవుడ్ ఏజెన్సీతో కూడా ఒప్పందం జరుపుకున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ సినిమా కోసం జక్కన్న హాలీవుడ్ నుంచి ఒక స్టార్ యాక్టర్ ని రంగంలోకి దించుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాల్లో ఒక ముఖ్య పాత్ర కోసం చిత్ర యూనిట్.. ప్రముఖ హాలీవుడ్ నటుడు “శామ్యూల్ ఎల్ జాక్సన్”ను తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మర్వెల్ మూవీస్ తో ఇక్కడి వారికీ కూడా పరిచయమైనా ఈ నటుడిని ముఖ్య తారాగణంగా తీసుకోవాలని దర్శకదీరుడు భావిస్తున్నాడట. అయితే ఈ వార్తలో ఎంత నిజమున్నదో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.