SSMB29 : రాజమౌళి-మహేష్ సినిమా అదే.. హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్లో మహేష్ సినిమా గురించి చెప్పిన రాజమౌళి..

తాజాగా రాజమౌళి టోరెంటో ఫిలిం ఫెస్టివల్ లో మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమా గురించి చెప్పారు. రాజమౌళి మాట్లాడుతూ.. '' నా నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో ఉంది. ఇది గ్లోబల్ మొత్తం..........

SSMB29 : రాజమౌళి-మహేష్ సినిమా అదే.. హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్లో మహేష్ సినిమా గురించి చెప్పిన రాజమౌళి..

Rajamouli spoke about Movie with Mahesh in a Film Festival

SSMB29 :  తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఇటీవల RRR సినిమాతో మరోసారి తన సత్తా చాటి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు అందుకుంటున్నారు. RRR సినిమా చూసి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు, సినీ టెక్నీషియన్స్ రాజమౌళి వర్క్ ని పొగుడుతున్నారు. పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ నుంచి రాజమౌళికి ఆహ్వానం అందుతుంది.

తాజాగా రాజమౌళి కెనడాలో టొరంటో ఫిలిం ఫస్ట్ కి హాజరయ్యారు. ఆ ఫిలిం ఫెస్టివల్ లో రాజమౌళి తీసిన సినిమాలని ప్రదర్శించనున్నారు. ఇప్పటికే రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించారు. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మహేష్- రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ఇప్పటికే తెగ ఆలోచిస్తున్నారు.

Mahesh Babu In TV Serial: కూతురు సితారతో కలిసి సీరియల్స్ లో మెరవనున్న సూపర్ స్టార్.. నిజమేనా?

తాజాగా రాజమౌళి టోరెంటో ఫిలిం ఫెస్టివల్ లో మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమా గురించి చెప్పారు. రాజమౌళి మాట్లాడుతూ.. ” నా నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో ఉంది. ఇది గ్లోబల్ మొత్తం ట్రావెల్ అయ్యే ఒక అడ్వెంచర్ మూవీ తరహాలో ఉంటుంది” అని తెలిపారు. దీంతో మహేష్ ప్రపంచ దేశాలన్నీ చుడుతూ సాహసాలు చేసే పాత్రలో నటించనున్నట్టు అర్ధమవుతుంది. గతంలో రచయిత విజయేంద్రప్రసాద్ మహేష్-రాజమౌళి సినిమా గురించి మాట్లాడుతూ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు రాజమౌళి చెప్పిన దాని బట్టి సినిమాని గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది.