గెస్ట్ కన్నా హోస్ట్‌గా ఉండడమే ఈజీ.. ఆహా లో ‘నెం.1 యారి’ సీజన్ 3..

తొలి తెలుగు ఓటీటీ రోజురోజుకీ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది. సూపర్ హిట్ మూవీస్, బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్, సెలబ్రిటీ షోలు, ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేసి ఆడియెన్స్‌కు మోర్ అండ్ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది.

గెస్ట్ కన్నా హోస్ట్‌గా ఉండడమే ఈజీ.. ఆహా లో ‘నెం.1 యారి’ సీజన్ 3..

No1 Yaari On AHA: తొలి తెలుగు ఓటీటీ రోజురోజుకీ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది. సూపర్ హిట్ మూవీస్, బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్, సెలబ్రిటీ షోలు, ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేసి ఆడియెన్స్‌కు మోర్ అండ్ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది.

No1 Yaari On AHA

ఇప్పుడు రానా దగ్గుబాటి హోస్ట్‌గా పాపులర్ షోకి సరికొత్త సీజన్‌తో రాబోతోంది ఆహా.. ‘నెం.1 యారి’.. ఈ షో తో రానా హోస్ట్‌గా సెలబ్రిటీలను, సామాన్యులను అలరించారు. రెండు సీజన్లతో ఆకట్టుకున్న ‘నెం.1 యారి’ మూడో సీజన్ ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చెయ్యడానికి ముస్తాబవుతోంది.

ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోకి మంచి రెస్పాన్స్ వస్తోంది.. తాజాగా ‘నెం.1 యారి’ షో విశేషాలను మీడియా ద్వారా ప్రేక్షకాభిమానులతో షేర్ చేసుకున్నారు రానా.. మార్చి 14 నుంచి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ‘నెం.1 యారి’ సీజన్ 3 ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది..