Telugu States Theatres : బొమ్మ పడేదెప్పుడు ? థియేటర్లు ఓపెన్ చేయాలి – నట్టికుమార్

Telugu States Theatres : బొమ్మ పడేదెప్పుడు ? థియేటర్లు ఓపెన్ చేయాలి – నట్టికుమార్

Producer Natti Kumar

Producer Natti Kumar : తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ఓపెన్ చేయాల్సి ఉంటుందని, జులై 01వ తేదీ నుంచి థియేటర్లు తెరుచుకొనే అవకాశం ఉందని నిర్మాత నట్టికుమార్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఎత్తివేసింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కంట్రోల్ లోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతంలో విధించిన నిబంధనలు, ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మూసి ఉన్నవి తెరుచుకోనున్నాయి. అయితే..సినిమా థియేటర్లపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.

ప్రభుత్వంతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని థియేటర్ల ఓనర్లు వెల్లడిస్తున్నారు. రెండు రోజుల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను థియేటర్ల యాజమాన్యాలు కలువనున్నాయి. అనంతరం దీనిపై స్పష్టత రానుందని తెలుస్తోంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వెల్లడిస్తున్నారు. ఏపీలో థియేటర్స్ థియేటర్స్ తెరుచుకుంటేనే…పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

దీనిపై నిర్మాత నట్టికుమార్ 10tvతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని కలిసేది ఏమి లేదు..రెండు రాష్ట్రాల సినిమా థియేటర్లు ఓపెన్ కావాల్సి ఉంటుందన్నారు. అప్పుడే ప్రొడ్యూసర్లు సినిమా అనౌన్స్ మెంట్ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. లాక్ డౌన్ కంటే ముందే..థియేటర్లు మూసివేయడం జరిగిందని గుర్తు చేశారాయన. అంతేగాకుండా..సినిమాలు విడుదల కూడా ఆగిపోయాయన్నారు. వకీల్ సాబ్, దెయ్యం..మూవీలు లాస్ట్ అని, రెండు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు జూలై 01వ తేదీ నుంచి తెరుచుకుంటాయని అనుకుంటున్నామని, పెద్ద సినిమాలు వేస్తేనే థియేటర్లు ఓపెన్ చేస్తామని అంటే మూసేసుకోవాల్సి ఉంటుందన్నారు. గవర్నమెంట్ గైడ్స్ లైన్స్ ఇచ్చిందని..దీని ప్రకారం నడుచుకోవాలన్నారు.

సినిమాలు రిలీజ్ చేయాలంటే…అన్నీ థియేటర్లు ఓపెన్ కావాల్సి ఉంటుందన్నారు. థియేటర్ల యాజమాన్యాలు ముందుకు రావాలని సూచించారు. కార్మికుల జీతాలు ఇవ్వాల్సి ఉందని, గతంలో కరెంటు బిల్లు ఇస్తామని, ట్యాక్స్ చూస్తామని..ఇతరత్రా హామీలు ఇచ్చారని, కానీ అలాంటిదేమి చేయలేదన్నారు. ఎగ్జిబ్యూటివ్ తరపున ఏడు రూపాయలు మెంటెనెన్స్ ఛార్జీలు అడగినట్లు, మినిమం రూ. 150 టికెట్ పైన ఇవ్వాలన్నారు. అలాగే..రూ. 150, రూ. 100, రూ. 50 ఇవ్వాలన్నారు. ఆంధ్రాలో కొన్ని రేట్లు తగ్గించి ఇచ్చారని నిర్మాత నట్టి కుమార్ తెలిపారు.