Amigos: కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రాన్ని ఈ హీరోలు రిజెక్ట్ చేశారా..?

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి సందడి చేస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఏకంగా ట్రిపుల్ రోల్‌లో నటించడంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమాకు రిలీజ్ రోజునే మంచి టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు.

Amigos: కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రాన్ని ఈ హీరోలు రిజెక్ట్ చేశారా..?

These Heroes Rejected Nandamuri Kalyan Ram Amigos Movie

Amigos: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి సందడి చేస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఏకంగా ట్రిపుల్ రోల్‌లో నటించడంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమాకు రిలీజ్ రోజునే మంచి టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు.

Amigos : అమిగోస్ రివ్యూ.. కొంచెం కన్ఫ్యూజ్ చేసినా సూపర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన కళ్యాణ్ రామ్..

కాగా, ఈ సినిమా కథ ప్రేక్షకులు ఊహించినంత లేకపోవడంతో వారు కాస్త నిరాశకు లోనవుతున్నారు. అయితే ఈ సినిమాను కళ్యాణ్ రామ్ కంటే ముందే మరో ముగ్గురు హీరోలు విన్నారని.. వారు రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా కళ్యాణ్ రామ్ చెంతకు చేరిందని తెలుస్తోంది. అమిగోస్ చిత్ర కథను తొలుత యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి వినిపించగా, ఆయన ఈ సినిమాకు నో చెప్పారట. ఆ తరువాత ఈ సినిమా కథను మ్యాచో స్టార్ గోపీచంద్‌కు వినిపించగా, ఆయన ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట.

Amigos: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ వచ్చేది ఈ ఓటీటీలోనే!

అటుపై ఈ సినిమా కథను మాస్ రాజా రవితేజకు వినిపించగా, ఆయన ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా కోరాడట. ఎట్టకేలకు ఈ సినిమా కథ కళ్యాణ్ రామ్ చెంతకు చేరడం, సినిమా పట్టాలెక్కడం, రిలీజ్ కావడం జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేయగా, ఆషిక రెడ్డి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.