Prabhas: మారుతి సినిమాలో ముగ్గురు హీరోయిన్స్.. ప్రభాస్ కోసం అనుష్క?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.

Prabhas: మారుతి సినిమాలో ముగ్గురు హీరోయిన్స్.. ప్రభాస్ కోసం అనుష్క?

Prabhas

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో పాటు తన నెక్ట్స్ ప్రాజెక్టులపై కూడా ప్రభాస్ పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ చిత్రాన్ని పూర్తి చేసిన ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ మొదలు పెట్టాడు. అంతేగాక సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ అనే సినిమాను కూడా ఇప్పటికే అనౌన్స్ చేశాడు.

Prabhas: ప్రభాస్ కోసం పోటీపడుతున్న కియారా, రష్మిక.. ఎవరు సెట్ అవుతారో?

అవన్నీ ఒకెత్తు అయితే.. ఎవరి అంచనాలకు అందకుండా ఆ మధ్య మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ అనే సినిమా కూడా చేయనున్నట్లు ప్రచారం మొదలైంది. టైటిల్ తో సహా వచ్చిన సోషల్ మీడియా న్యూస్ అప్పుడే ఫ్యాన్స్ ను ఒకింత కలవర పెట్టినా, మారుతి స్టయిల్ ఆఫ్ కామెడి టైమింగ్ తో సినిమా ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చర్చించుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. కాగా.. ఇప్పుడు ఈ సినిమాపై జరుగుతున్న చర్చ ప్రకారం.. భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారట.

Prabhas: బ్రేక్‌లోనే కానిచ్చేస్తానంటోన్న ప్రభాస్!

ఆ ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి అని గతంలోనే ప్రచారం జరగగా.. ఆ రూమర్ నిజమేనని ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇప్పటికే మారుతీ అనుష్కతో చర్చలు కూడా జరపగా.. మిగతా ఇద్దరు హీరోయిన్స్ కోసం మేకర్స్ హంటింగ్ మొదలు పెట్టారట. ప్రభాస్-అనుష్క హిట్ కాంబినేషన్. బాహుబలి తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. అందుకు తగ్గట్లే మారుతీ ఈ కాంబినేషన్ సెట్ చేసి సినిమాకు హైప్ తీసుకొచ్చే పనిలో ఉన్నాడట. అయితే.. ఈ సినిమా మొదలయ్యేది ఎప్పుడు.. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించేదెప్పుడు అన్నది స్పష్టతలేదు.