Director Sarath: టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ దర్శకుడి కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది ఇప్పటికే భారతరత్న లతా మంగేష్కర్, సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబు, సంగీత దర్శకుడు బప్పీలహరి, పాటల రచయిత కందికొండ కన్ను మూయగా..

Director Sarath: టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ దర్శకుడి కన్నుమూత

Director Sarath

Director Sarath: టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది ఇప్పటికే భారతరత్న లతా మంగేష్కర్, సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబు, సంగీత దర్శకుడు బప్పీలహరి, పాటల రచయిత కందికొండ కన్ను మూయగా ఇప్పుడు తనదైన యాక్షన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శరత్ శుక్రవారం ఉదయమే కన్నుమూశారు. శరత్ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

Tollywood Drugs Case: మళ్లీ టాలీవుడ్ యాక్టర్ల గుండెల్లో భయం

తెలుగులో ఆయన దాదాపు 20 చిత్రాల‌కు ద‌ర్శక‌త్వం వ‌హించారు. ‘డియర్’ అనే న‌వ‌ల ఆధారంగా ‘చాద‌స్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ప‌రిచ‌యమైన శరత్.. ఎక్కువగా సుమన్, బాలకృష్ణలతో సినిమాలను తెరకెక్కించారు. ముఖ్యంగా కుటుంబ నేపథ్యంలో యాక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో పేరు తెచ్చుకున్నాడు. సుమన్‌తో ‘పెద్దింటల్లుడు’, ‘కలెక్టర్ గారి అల్లుడు’,‘బావ బావమరిది, ‘దొంగ అల్లుడు, ‘చిన్న అల్లుడు’, హలో అల్లుడు, అబ్బాయి గారి పెళ్లి, కృష్ణతో సూపర్ మొగుడు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

Tollywood Star’s: హైప్ ఉన్నప్పుడే హైని చూసేయాలి.. ఇదే ఇప్పుడు ట్రెండ్!

ఇక, బాలకృష్ణతో ‘వంశానికొక్కడు,’ పెద్దన్నయ్య’, సుల్తాన్’, వంశానికొక్కడు’ వంటి చిత్రాలతో పాటు అక్కినేని నాగేశ్వరరావు, శ్రీకాంత్‌లతో ‘పండగ’ సినిమాలను తెరకెక్కించారు. శరత్ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శరత్ మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొనగా ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. శనివారం 11గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన పెళ్లి చేసుకోకపోవడంతో బంధువులే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది.